Gudumba Shanker: మెగా బ్రదర్ కి పోటీగా బండ్లన్న?

Gudumba Shankar, Gabbar Singh Re Release

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ఊపు అంతకంతకు పెరిగిపోతుంది. ఈ సంవత్సరం లో ఇప్పటికే ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది, సూర్య సన్ ఆప్ కృష్ణన్ వంటి సినిమాలు రీ రిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక పలు చిన్న హీరోల సినిమాలు కూడా లిమిటెడ్ స్క్రీన్స్ లో విడుదలయ్యాయి. ఇక తాజాగా మహేష్ బాబు బర్త్ డే కానుకగా బిజినెస్ మ్యాన్ రిలీజ్ కాగా థియేటర్లో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు మళ్ళీ పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నిర్మాత నాగబాబు పవన్ కళ్యాణ్ నటించిన “గుడుంబా శంకర్” సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆరెంజ్ సినిమాకి చేసినట్టే, గుడుంబా శంకర్ ద్వారా వచ్చే కలెక్షన్లను కూడా జనసేన పార్టీ కి విరాళంగా ఇవ్వనున్నట్టు నాగబాబు తెలిపారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది.

పవన్ భక్తుడు అని చెప్పుకునే మరో నిర్మాత బండ్ల గణేష్ కూడా తాను నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితే ఈ సమాచారం గురించి బండ్ల గణేష్ అఫిషియల్ గా చెప్పకపోయినా, ఆయన సన్నిహితులు మాత్రం గుడుంబా శంకర్ పవన్ బర్త్ డే కి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

- Advertisement -

అయితే ఒకే సారి రెండు సినిమాలు వస్తే పెద్దగా సెలెబ్రేషన్స్ ఉండవని, ఏ సినిమాకెళ్లాలో తెలీక పవన్ ఫ్యాన్స్ కంఫ్యూజింగ్ లో ఉంటారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయినా ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా గుడుంబా శంకర్ కే ప్రిఫెరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చి పదేళ్లే అయింది. కాబట్టి ఆ సినిమాను చాలా మంది చూసే ఉంటారు. కానీ గుడుంబా శంకర్ వచ్చి 19ఏళ్ళు అవుతుంది. అందువల్ల ఈ సినిమా చూసిన యూత్ తక్కువగా ఉంటారు. కాబట్టి ఫ్యాన్స్ గుడుంబా శంకర్ కి ఓటేసే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 2వరకు గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుందని గ్యారెంటీ గా చెప్పలేము. దీని గురించి బండ్ల గణేష్ మరోసారి క్లారిటీ ఇస్తే మంచిది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు