Tollywood: ఆరెంజ్ రీ రిలీజ్ ఓవరాల్ కలెక్షన్లు.. ఎక్స్పెక్ట్ చేయలేని రికార్డ్ ఇది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుక గా ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లు సాధించింది. రామ్ చరణ్ కి ఆరెంజ్ చాలా ప్రత్యేకమైందది. ఈ సినిమా 2010 లో విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆరెంజ్ టీవీ ల్లో విడుదలైనప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్స్.

బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాను నాగబాబు నిర్మించాడు. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించాడు. ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ కే కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా చాలా ఇష్టమైన సినిమా. అందుకే ఫ్యాన్స్ డిమాండ్ తో రామ్ చరణ్ బర్త్ డే రోజు రిలీజ్ చెయ్యాలనుకున్న మగధీర ని క్యాన్సిల్ చేసి మరీ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.

ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక ప్లాప్ సినిమా రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా విడుదలైన తోలి రోజు ప్రీమియర్స్ కి కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే 25 లక్షలకి పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్లు తాజాగా విడుదల చేశారు. మార్చి 25 న రీ రిలీజ్ అయిన ఆరెంజ్ వరల్డ్ వైడ్ గా 3.36 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఖుషి తర్వాత హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మధ్యే విడుదలైన దేశముదురు మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందనుకున్నా అది జరగలేదు. టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ని గమనిస్తే వరుసగా
ఖుషి – 7.30 cr
ఆరెంజ్ – 3.36 cr
జల్సా – 3.20 cr
ఒక్కడు – 2.54 cr
పోకిరి – 1.73 cr
దేశముదురు – 1.65 cr
చెన్నకేశవరెడ్డి – 1.10 cr
బిల్లా – 1.05cr

ఇక ఎన్టీఆర్ బర్త్ డే కానుక గా మే 20 న సింహాద్రి సినిమా రీ రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, టాప్ గ్రాస్సింగ్ మూవీస్ లో ఏ ప్లేస్ లో నిలుస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు