Shakeela: గుక్క పెట్టి ఏడ్చిన షకీల.. మానస్ ఏం చేశారంటే..?

Shakeela.. ఒకానొక సమయంలో శృంగార భరిత పాత్రలలో నటించి తెలుగు, తమిళ్, మలయాళం ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ప్రముఖ యాక్ట్రెస్ షకీలా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. ముఖ్యంగా మలయాళంలో ఈమె సినిమాలు విడుదలవుతున్నాయి అంటే..మలయాళం మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి బడా హీరోల సినిమాలు కూడా థియేటర్లలో వాయిదా పడేవి.. దీన్ని బట్టి చూస్తే ఈమెకు మలయాళం లో ఎంత డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతలా బోల్డ్ నటిగా పాపులారిటీ సొంతం చేసుకుంది షకీలా..

లవ్ యు అమ్మ షో లో సందడి చేసిన స్టార్స్..

Shakeela: Shakeela who was crying.. What did Manas do..?
Shakeela: Shakeela who was crying.. What did Manas do..?

వృత్తిపరంగా ఉన్నత స్థానాలను చేరుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ చీకటి కష్టాలే.. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేకపోయినా.. కష్టాలు అన్నింటిని ఎదుర్కొంది.. తన లైఫ్ స్టోరీ గురించి పలుమార్లు పలు సందర్భాలలో వివరించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె జీవితాన్ని దృశ్యం రూపంలో కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఈ రోజు ఆదివారం మే 12న మదర్స్ డే సందర్భంగా స్టార్ మా లో ‘ లవ్ యు అమ్మ ‘అనే షో ప్లాన్ చేశారు. ఈ షో కి యాంకర్ రవి , వర్షిణి హోస్ట్ గా చేస్తున్నారు.. జబర్దస్త్ రోహిణి, భాను శ్రీ, బుల్లితెర నటుడు మానస్..వీళ్లంతా కూడా వారి తల్లులతో వచ్చి ఈ షోలో పాల్గొని సందడి చేశారు.. ఇక బుల్లితెర నటీనటులతో పాటు షకీలా కూడా హాజరైంది… ఈరోజు ప్రసారం అయ్యే ఈ షో కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా ఈ షో ను తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేసేలా చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

వెక్కివెక్కి ఏడ్చిన షకీలా..

ఇక ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తమ తల్లితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. చివర్లో షకీలా జీవితాన్ని దృశ్య రూపంలో వివరించే ప్రయత్నం చేశారు.. తన జీవితాన్ని తానే చూసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది షకీలా.. తన కుటుంబ సభ్యులే ఆమెను బలవంతంగా డబ్బు కోసం ఎలా శృంగార నటిగా మార్చారు? సొంత తోబుట్టువు అయిన అక్కని నమ్మి ఆమె ఎలా మోసపోయింది ? ఇలాంటి అంశాలు కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు..సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తన అక్క జాగ్రత్త పరుస్తుందని నమ్మి ఆమెకిస్తే.. ఆమె వాడుకొని మోసం చేసింది.. ఇలాంటి వాటిని కూడా ఈ షోలో చూపించారు..చివరికి తాను ఒంటరిగా మారితే ట్రాన్స్ జెండర్స్ తనను అమ్మగా ఎలా స్వీకరించారు అనే విషయాలను కూడా చూపించారు.. మొత్తానికైతే ఈ దృశ్యాలన్నీ కూడా చూసి షకీలా మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు అందరూ కంటతడి పెట్టుకున్నారు .. కంటేనే అమ్మ కాదు వీళ్లంతా నా బిడ్డలే అంటూ ట్రాన్స్ జెండర్స్ ని ఉద్దేశించి షకీలా చెబుతూ భాగోద్వేగానికి గురైంది..

- Advertisement -

ఆడపిల్లల కోసం బుల్లితెర హీరో మానస్ గొప్ప నిర్ణయం..

ఇకపోతే చివర్లో బుల్లితెర హీరో మానస్ కూడా ఆడపిల్లల చదువు కోసం కొంత మొత్తం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.. మొత్తానికైతే తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని ప్రోమోలో చెప్పడం ప్రోమోకే హైలైట్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు