Kriti Sanon: కాబోయే వాడికి పక్కా అవి ఉండాల్సిందే !

 

 

Kriti Sanon: చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొంతమంది మాత్రం తొందరగా పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నుపూర్ సనన్ సోదరి ఈ కృతి. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదటగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

- Advertisement -

ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసేసింది. మొట్టమొదటిగా 2014 సంవత్సరంలో మన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి. మహేష్ బాబు హీరోగా చేసిన నేనొక్కడినే సినిమాలో సమీరా పాత్ర చేసింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది కృతి సనన్. అయితే తాజా కాబోయే భర్త… గురించి సంచలనం వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ కృతి సనన్.

తనకు కాబోయే భర్త ఎప్పుడు తనను నవ్వించాలని పేర్కొంది. అలాగే తన వద్ద నిజాయితీగా ఉండాలని వెల్లడించింది. ఎప్పుడు తనను సంతోషపెట్టాలని… మోసం చేసేవాడు వద్దని తెలిపింది. కష్టాల్లో లాగే సంతోషం ఉన్న సమయాలలో తనను బాగా చూసుకోవాలని.. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. త్వరలోనే కృతి పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే తన భర్తకు కావాల్సిన క్వాలిటీ వివరాలు ఇలా చెప్పిందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు