19Years for Bhadra : రవితేజ “భద్ర” కి 19ఏళ్ళు.. బోయపాటి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే..

19Years for Bhadra : మాస్ మహారాజ్ రవితేజ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన “భద్ర” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పటికి టివి లలో టెలికాస్ట్ చేస్తే మంచి టిఆర్పి రేటింగ్ తెచ్చుకుంటుంది. రవితేజ మాస్ ఎనర్జీకి తోడు బోయపాటి మాస్ డైరెక్షన్ కి దేవిశ్రీ సూపర్ హిట్ మ్యూజిక్ హెల్ప్ అవడంతో సినిమా మంచి హిట్ అయింది. నిజానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఈ మూవీ టాప్ లో ఉంటుంది. ఇక 2005 మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో సరిగ్గా 19ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం.

బోయపాటి పక్క స్క్రీన్ ప్లే టేకింగ్..

మాస్ రాజా రవితేజ, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘భద్ర’ సినిమా. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు బోయపాటి శ్రీను. ఇక దర్శకుడిగా ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టిన బోయపాటి ఆ తర్వాత తులసి, సింహ వంటి వరుస విజయాలతో ఊపు ఊపారు. అయితే ఒక్కో సినిమాతో దర్శకులుగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందుకు సాగుతున్న బోయపాటికి కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక బోయపాటి శ్రీను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా భద్ర సినిమానే పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని బోయపాటి చూపించిన విధానం, పాటలు, ఫైట్స్, కథ, ఎమోషన్స్ ఇలా అన్ని విభాగాల్లో బెస్ట్ గా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను సినిమాల్లో ఫైట్స్ కాస్త ఓవర్ గా ఉంటాయని అంటూ ఉంటారు. ఈ సినిమాలో మాత్రం పక్కా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంటాయి. చాలా మందికి తెలీని విషయం ఏంటంటే బోయపాటి శ్రీను ఈ సినిమాకి రెమ్యూనరేషన్ బదులు, సినిమా షూటింగ్ మొదలై రిలీజ్ అయ్యే వరకు నెలకు 40 వేల రూపాయలు జీతం మాత్రమే తీసుకున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా బోయపాటి ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

19Years for Raviteja Bhadra Movie

- Advertisement -

రవితేజ మాస్ ఎనర్జీకి దేవిశ్రీ క్లాస్ సాంగ్స్..

ఇక భద్ర (19Years for Bhadra) సినిమా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, సినిమాలో పాటలు మాత్రం చాలా క్లాస్ గా ఉంటాయి. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కులశేఖర్, భాస్కరభట్ల, విశ్వ పాటల రచన చేయగా, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు అందించాడు. ‘తిరుమలవాసా’, ‘ఓ మనసా’, ‘ఆకాశం నేలకి వచ్చింది’, ‘ఏమైంది సారూ’, ‘ఎర్రకోకా పచ్చరైకా’, ‘ఏ ఊరే చిన్నదానా’.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా, 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే 15 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ కావడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు