Raviteja : మరో దర్శకుడుని పరిచయం చేయనున్నాడు

Raviteja : మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమా రవితేజకు నటుడుగా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. రవితేజ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటేనే వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. రవితేజ కి మంచి హిట్స్ అందించాడు పూరి జగన్నాథ్.

రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పటినుంచి పూరి జగన్నా ఎప్పుడూ కూడా రవితేజతో నిన్ను మంచి హీరోని చేస్తాను, హీరోని చేస్తాను అంటూ ఉండేవాడు. కానీ ఆ మాటలు రవితేజ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం దానిని నిజం చేసాడని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో ఇడియట్ అమ్మానాన్న తమిళ అమ్మాయి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి హిట్ సినిమాలను అందించాడు పూరి జగన్నాధ్.

రవితేజ వల్ల ఇండస్ట్రీకి పరిరచయమైన డైరెక్టర్లు

రవితేజ ( Raviteja ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం నటుడు గానే కాకుండా హీరోగా కూడా మంచి గుర్తింపు సాధించుకొని, చాలామంది దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. షాక్ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడుగా పరిచయం చేసాడు రవితేజ. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత హరిష్ శంకర్ అవకాశం ఇచ్చి మిరపకాయ అనే సినిమాతో దర్శకుడుగా నిలబెట్టాడు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ప్రస్తుతం మళ్లీ హరీష్ శంకర్ దర్శకత్వంలోనే మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు రవితేజ.

- Advertisement -

అలానే రవితేజ పరిచయం చేసిన మరో డైరెక్టర్ బాబి. పవర్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బాబి. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తర్వాత జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలను తెరకెక్కించి మెగాస్టార్ చిరంజీవితోనే అవకాశాన్ని అందుకున్నాడు బాబి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవిలో మిస్ అయిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మంచి హిట్ అందించాడు బాబి.

ఇకపోతే గోపీచంద్ మలినేని ను కూడా రవితేజ దర్శకుడుగా పరిచయం చేశాడు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తో వీర సింహారెడ్డి అనే సినిమాను చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్. ఇకపోతే మళ్లీ రవితేజ తోనే సినిమా చేయనున్నారు గోపి. అలానే ఇప్పుడు మరో కొత్త దర్శకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నాడు మాస్ మహారాజా.

ఇప్పుడు మరో డైరెక్టర్

రీసెంట్ గా యాక్షన్ ఫిలిమ్స్ తో ప్లాప్స్ అందుకుంటున్న రవితేజ ఒక కామెడీ స్టోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే సామజవరగమన సినిమా రచయిత భాను భోగవరపు ఒక కథను రవితేజకు చెప్పాడట. అయితే ఆ కథ తనకు నచ్చడంతో భానుని దర్శకుడుగా పరిచయం చేసే పనిలో పడ్డాడట రవితేజ దీని గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు