Ajith : ఫ్యాన్ మూమెంట్.. నటరాజన్ బర్త్ డే థలా చేతుల మీదుగా..

Ajith : ప్రముఖ స్టార్ క్రికెట్ బౌలర్ టి నటరాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండియా లో అన్ని ఫార్మాట్లలో ఆడిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఇతడు ఇండియన్ టీమ్ లో ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇక నటరాజన్ తమిళనాడు క్రికెట్ జట్టు, ఐపిఎల్ లో కింగ్స్‌ XI‌ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడగా, ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్‌లోనే భారత తరపున అన్ని ఫార్మాట్లలో ఆడిన తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇక యార్కర్ స్పెషలిస్ట్‌ అయిన నటరాజన్ ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ లో ఆటగాడిగా కొనసాగుతున్న నటరాజన్ హైదరాబాద్ లో ఉన్నాడు. ఇక నటరాజన్ కోలీవుడ్ స్టార్ అజిత్ అంటే చాలా చచ్చేంత అభిమానం. ఎప్పటికప్పుడు థలా అజిత్ అభిమానులు కూడా నటరాజన్ ఆడే మ్యాచ్ లకు వచ్చి అజిత్ తరపున శుభాకాంక్షలు చెప్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. తన ప్రతి పుట్టినరోజుకు థలా అజిత్ అభిమానుల సౌజన్యంతో ట్విట్టర్‌లో శుభాకాంక్షలు విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి క్రికెటర్ నటరాజన్ పుట్టినరోజుకి కెరీర్ లో ఇప్పటివరకూ మర్చిపోలేని గొప్ప గిఫ్ట్ లభించిందని చెప్పాలి.

అభిమాన హీరో చేతుల మీదుగా బర్త్ డే..

అయితే నటరాజన్ ప్రస్తుతం సన్ రైజర్స్ టీమ్ లో కొనసాగుతుండగా, తన తదుపరి మ్యాచ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 04న నటరాజన్ బర్త్ డే సందర్బంగా తాజాగా గొప్ప ట్రీట్ దక్కింది. తన పుట్టినరోజుని తన ఫెవరేట్ స్టార్ థలా అజిత్ దగ్గరుండి సెలెబ్రేట్ చేయడం జరిగింది. తన కొత్త సినిమా ‘విదా మయూర్చి’ షూటింగ్ షెడ్యూల్ లో ఉన్న థలా ఆ షెడ్యూల్ ముగించుకుని మధ్యప్రదేశ్‌ నుండి బైక్‌ ట్రిప్‌ ద్వారా తిరిగి వచ్చారు. ఈ ట్రిప్‌లో అతని ‘విదా ముయార్చి’ లో తన సహనటుడు ఆరవ్ అతనితో మరియు అతని స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కి షూటింగ్ నిమిత్తం వచ్చిన థలా అజిత్(Ajith) తన అభిమాని స్టార్ బౌలర్ అయిన నటరాజన్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసారు. ఈ సంతోషమంతా నటరాజన్ కళ్ళలో తెలుస్తూనే ఉంది.

త్వరలో గుడ్ బ్యాడ్ అగ్లీ..

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు మగిజ్ తిరుమేని తో చేస్తున్న ‘విదా ముయార్చి’ షూటింగ్‌ తదుపరి షెడ్యూల్ ని అజర్ బైజాన్ లో చిత్రీకరించనున్నారు, మరియు ఈ సంవత్సరం చివర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ‘విదా ముయార్చి’ సినిమా తర్వాత, అజిత్ కుమార్ తన రాబోయే చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు, దీనికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ చిత్రం 2025 పొంగల్ రోజున థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక అతి త్వరలోనే , మేకర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ యొక్క క్యాస్ట్ ని ప్రకటించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు