Ajith Good Bad Ugly: మైత్రీ తో థలా ద్విభాషా చిత్రం…

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో ఆల్మోస్ట్ సినిమాలు చేసిన మైత్రి వారు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలకి చెందిన స్టార్స్ తోనూ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. అందుకు ఫస్ట్ మూవీతోనే జాక్ పాట్ కొట్టాలి అన్నట్టుగా ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ తోనే తమ కొత్త సినిమా అనౌన్స్ చేసారు మైత్రి మూవీ మేకర్స్. ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ థలా అజిత్. అవును.. మైత్రి మూవీ మేకర్స్ తమ కొత్త సినిమాను అజిత్ తో తీస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ని కూడా నిర్ణయిస్తూ పోస్టర్ ని లాంచ్ చేసారు మేకర్స్.

గుడ్ బ్యాడ్ అగ్లీ..
అజిత్ హీరోగా నటించబోయే ఈ కొత్త సినిమా పేరు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరుతో తెరకెక్కిస్తుండగా, ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ గురువారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ తోపాటు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

భారీ టెక్నిషియన్స్..

- Advertisement -

ఇక థలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కోసం పని చేసే సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎటిటర్ గా, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్స్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక అజిత్ చివరగా తునివు సినిమాలో నటించగా, గతేడాది పొంగల్ కు ఆ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి మూవీలో నటిస్తున్నాడు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో అందరు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, RC16 వంటి బడా సినిమాలతో పాటు, పలు మీడియం రేంజ్ సినిమాలని కూడా నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు అజిత్ సినిమాతో తమిళ్ లోనూ పాగా వేసేందుకు రెడీ అయ్యారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు