Aranmanai4 : సుందర్.సి హర్రర్ సిరీస్ లో నాలుగోది రెడీ..

సినిమా దర్శకుల్లో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కో డైరెక్టర్ ఒక్కో జోనర్ లో సినిమా తీయడంలో నిష్ణాతులై ఉంటారు. పైగా ఆ సినిమాలలోనే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. తెలుగులో పూరి జగన్నాథ్ అంటే గన్ లు, వివి వినాయక్ అంటే సుమోలు అంటారు. అలాగే అనిల్ రావిపూడి అంటే కామెడీ ఎంటర్టైనెర్స్, బోయపాటి సిరను అంటే ఊర మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో ఫేమస్. ఈ విధంగానే కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్.సి హారర్ కం డివోషనల్ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి అలరిస్తుంటారు. అలా అని ఆయనే కేవలం ఆ జోనర్ చిత్రాలే తీయలేదు. కానీ ఆయనకు ఈ మధ్య కాలంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టినవి మాత్రం అవే. ఇక ఆ రోజుల్లోనే అరుణాచలం లాంటి సెన్సేషనల్ చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత సుందర్ కే దక్కింది. వీటితోపాటు గ్లామర్ కమర్షియల్ మూవీలు కూడా తెరకెక్కించి హిట్లు కొడుతుంటారు.

అరణ్మణై పార్ట్ 4 రెడీ.. (చంద్రకళ)

కోలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన సుందర్ సి ప్రముఖ నటి ఖుష్బూ భర్త అని తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అరణ్మనై 4 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అరణ్మనై సిరీస్ లో నాలుగో భాగం కాగా, హారర్ కామెడీ జోనర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఎప్పుడూ ఫుల్ గ్లామర్ తో అలరించే ఈ భామలు ఈ సినిమాలో దెయ్యాలుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్ లో తమన్నాను దెయ్యంగా చూపించారు మేకర్స్.

- Advertisement -

హాట్ లుక్స్ తో తమన్నా, రాశిఖన్నా..

తాజాగా అరణ్మలై సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తమన్నా తో పాటు రాశీ ఖన్నా అల్ట్రా గ్లామర్ గా కనిపిస్తూ ఫోజులిచ్చింది. ఈ ఇద్దరూ స్టైలిష్ ఔట్ ఫిట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నారు. ఇక సినిమాలో వీళ్లిద్దరితో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తుండగా తీసిన ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అయితే అరణ్మలై4 తెలుగులో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో, ఏ పేరుతో విడుదల అవుతుందో ఇంకా తెలియలేదు. కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు నెటిజన్లు చెబుతున్నారు. ఇక సుందర్ సి సరిగ్గా పదేళ్ల కింద అంటే 2014 లో అరణ్మనై ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించారు. హన్సిక, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం, తెలుగులో చంద్రకళ పేరుతో రిలీజై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత అరణ్మనై 2లో త్రిష, హన్సిక నటించగా కళావతి పేరుతో మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ఇక మూడేళ్ల క్రితం అరణ్మనై 3 తెలుగులో అంతఃపురం పేరుతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా సరే సుందర్ నాలుగో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో దర్శకుడు సుందర్ మొదటి భాగాలతో మెప్పించినట్టు మరోసారి మ్యాజిక్ చేస్తాడా అనేది చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు