Tamannaah Bhatia : 19 ఏళ్ల కెరియర్ లో ఎవరిని అలా చూడలేదు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా యాక్టర్స్ లో తమన్నా ఒకరు. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అయితే తమన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం హ్యాపీ డేస్ అని చెప్పొచ్చు. హ్యాపీ డేస్ సినిమాలో మధు అనే పాత్రలో కనిపించింది తమన్నా. ఆ తర్వాత కాళిదాసు, రెడీ, నిన్న నేడు రేపు వంటి సినిమాలను చేసింది తమన్న. అయితే ఈ సినిమాలేవి అంతగా గుర్తింపును తీసుకొని రాలేదు.

ఆ తర్వాత సిద్దార్థ్ తో జంటగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాలో కనిపించింది తమన్నా. ఈ సినిమాలో గీతా పాత్రలో కనిపించిన తమన్నకి మంచి మార్కులు పడ్డాయి. చాలామంది యూత్ ని ఆకట్టుకుంది తమన్నా. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది తమన్నా.

మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాలో కనిపించి మంచి హిట్ అందుకుంది. నాగచైతన్య సరసన ఈ సినిమాలో మహాలక్ష్మి క్యారెక్టర్ లో కనిపించి అందర్నీ అద్భుతంగా ఆకట్టుకుంది తమన్న. ఈ సినిమా తర్వాత ఏకంగా అల్లు అర్జున్ సరసన బద్రీనాథ్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోస్ నటించి తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.

- Advertisement -

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో కనిపించింది తమన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పవర్ స్టార్ సినిమాలో తమన్నా నటించిన తర్వాత ఇంక తమన్నా కెరీర్ కి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఆ తర్వాత చాలా సినిమాల్లో తమన్నా నటిస్తూ వచ్చింది. అయితే తమన్నా పాన్ ఇండియా యాక్టర్స్ గా తెలిసింది మాత్రం బాహుబలి సినిమాతో అని చెప్పొచ్చు.

బాహుబలి సినిమాలో తమన్నా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇచ్చింది. అక్కడితో పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోయింది తమన్నా. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో తమన్నా హవా కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో తమన్నా సంపత్ నందితో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే వీరిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. రీసెంట్ గా సంపత్ నంది ప్రజెంట్ చేస్తున్న ఓదెల -2 లో తమన్నా కనిపించనుంది.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి తమన్నా లుక్ ని రీవిల్ చేశారు. అయితే ఆ లుక్ అంత అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి ఒక థాంక్స్ నోట్ రాసి థాంక్యూ చెప్పాడు సంపత్ నంది. అయితే దీనిని తమన్న రీట్వీట్ చేస్తూ నా 19 ఏళ్ల కెరియర్ లో ఇలా పేరుపేరునా టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్ చెప్పడం చూడలేదు అంటూ సంపత్ నందిని కొనియాడింది తమన్నా.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు