GV Prakash Kumar : 17 ఏళ్ల కెరియర్ లో మొదటిసారి

జీవి ప్రకాష్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు జీవి ప్రకాష్. అయితే జీవి ప్రకాష్ తెలుగులో కంటే కూడా తమిళంలో ఎక్కువ సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడు. కేవలం సంగీతం దర్శకుడుగానే కాకుండా గాయకుడు నటుడుగా కూడా తాను తాను ప్రూవ్ చేసుకున్నాడు జీవి ప్రకాష్. జీవీ ప్రకాష్ ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడు అని చాలా తక్కువ మందికి తెలుసు.

మొదట ఏఆర్ రెహమాన్ దగ్గర కొన్ని సినిమాలకు మ్యూజిక్ విభాగంలో పనిచేశాడు జీవీ ప్రకాష్. శంకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ చేసిన జెంటిల్మెన్ అలానే ఇంకొన్ని సినిమాలకు రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు జీవి ప్రకాష్. ఆ తర్వాత హరీష్ జయరాజ్ దగ్గర కూడా కొన్నేళ్లు పనిచేశారు. హరీష్ జయరాజ్ సంగీతం అందించిన అపరిచితుడు సినిమాలో పాటను కూడా పాడాడు జీవి ప్రకాష్.

వసంత్ బాలన్ దర్శకత్వంలో వచ్చిన వెయిల్ అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్రకాష్. ఆ తర్వాత మద్రాస్ పట్నం అనే సినిమాకి సంగీతం అందించాడు ప్రకాష్. ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అయితే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన “మయక్కం ఎన్న” సినిమాకి జీవి ప్రకాష్ అందించిన సాంగ్స్ అద్భుతమని చెప్పాలి. అక్కడితో మంచి బ్రేక్ వచ్చింది జీవి ప్రకాష్ కి.

- Advertisement -

కరుణాకర్ దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలకు సంగీతం అందించాడు జీవి. అయితే జీవి ప్రకాష్ తెలుగులో సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కరుణాకర్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తర్వాత కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమాకి సంగీతాన్ని అందించాడు జీవి.

ఆ తర్వాత కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఎందుకంటే ప్రేమంట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఒంగోలు గిత్త. వంటి సినిమాలకు సంగీతాన్ని అందించాడు. అయితే రీసెంట్ గా జీవి ప్రకాష్ కుమార్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అంటే ధనుష్ నటించిన సార్ అని చెప్పొచ్చు. సార్ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మితమవుతున్న దుల్కర్ సల్మాన్ సినిమాకి కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

అయితే తన 17 ఏళ్ల మ్యూజిక్ కెరియర్ లో ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ ఏ రోజు కూడా జీవి ప్రకాష్ కి కాంప్లిమెంట్ ఇవ్వలేదు. రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి చాలా బాగా చేసావని కాంప్లిమెంట్ ఇచ్చి తనను అప్రీసెట్ చేసినట్టు రీసెంట్ గా ఒక మీడియా ఛానళ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు జీవి ప్రకాష్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు