Akash Puri : నాన్నతో సినిమా చేయను

ఆకాష్ పూరి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2007లో రిలీజ్ అయిన చిరుత సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించి చాలా చిన్న ఏజ్ లోనే అద్భుతమైన టాలెంట్ ఉంది అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కి చిన్నప్పటి క్యారెక్టర్ చేసి అక్కడ కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ , బిజినెస్ మెన్ , గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో కనిపించే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఆకాష్ పూరి.

అయితే 2017 లో వచ్చిన ఆంధ్ర పోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ ని సాధించలేకపోయింది. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా అనే సినిమాలో నటించాడు ఆకాష్. ఈ సినిమాలో రోషన్ అనే పాత్రలో కనిపించాడు ఆకాష్. ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇంకా కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆకాష్ సినిమా చేస్తే బాగుణ్ణు అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసినప్పుడు చాలా మందికి.

అయితే ఈ సినిమా తర్వాత ఆకాష్ హీరోగా చేసిన సినిమా రొమాంటిక్ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. కానీ ఈ సినిమాలో ఆకాష్ నటించిన తీరు మాత్రం చాలా మందిని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో నటించాడు ఆకాష్. ఆ తర్వాత జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమా చేశాడు ఆకాష్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

- Advertisement -

అయితే ఆకాష్ కి టాలెంట్ లేక అని కాదు. సరైన స్క్రిప్ట్స్ ఎన్నుకోక ఇప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నడని చెప్పొచ్చు. అయితే ఆకాష్ కున్న టాలెంట్ కి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడితే అది మంచి విజయాన్ని సాధిస్తుందని చాలామంది నమ్మకం. ఇకపోతే రీసెంట్ గా ఆర్ సి ట్రెండ్ సెట్టర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆకాష్ పూరి తన తండ్రితో సినిమా గురించి ఒక విషయాన్ని తెలిపాడు.

అయితే ఒక జర్నలిస్ట్ మీ నాన్న గారితో సినిమా ఎప్పుడు అని అంటే ఇప్పట్లో నాన్న గారితో సినిమా చేసే ఉద్దేశ్యం నాకు లేదు. నేనే కావాలని వద్దనుకుంటున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న తర్వాత పూరీ జగన్నాథ్ ఆకాష్ పూరి కాంబినేషన్లో మీరు సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ చెప్పాడు ఆకాష్.

ఇకపోతే ఆకాష్ పూరికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఆకాష్ ఒక సూపర్ హిట్ ఫిలిమ్ చేస్తే ఆడియన్స్ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆకాష్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను కూడా చాలా మంది ఇష్టపడతారు. ఒక స్టార్ డైరెక్టర్ కొడుకు అని కొంచెం కూడా గర్వం లేకుండా ఆకాష్ పూరి అందరితో బిహేవ్ చేసే విధానం చాలా మందికి ఇష్టం అని కూడా చెప్పొచ్చు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు