Robert Downey: ఆస్కార్ రావడం వెనుక ఇంత కష్టం పడ్డారా..?

నేడు లాస్ ఏంజిల్స్ లో 96వ ఆస్కార్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో ఓపెన్ హైమర్ సినిమాకి గానూ ఐరన్ మాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు.. హాలీవుడ్ లో దాదాపు 1970 నుంచి సినిమాలు చేస్తున్న రాబర్ట్ డౌనీ ఐరన్ మాన్ సినిమాలు, షెర్లాక్ హోమ్స్, అవెంజర్స్ లాంటి చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా మన ఇండియాలో రాబర్ట్ డౌనీ ఐరన్ మాన్ గా గుర్తింపు సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోని ఇక్కడి పిల్లలకు, పెద్దలకు ఈయన గురించి బాగా సుపరిచితం అని చెప్పవచ్చు..

ఆస్కార్ వెనక అసలు కష్టం..
ఇకపోతే రాబర్ట్ డౌనీ ఎప్పటినుంచో ఆస్కార్ సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 1993 లోని మొదటిసారి చాప్లిన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అయ్యారు.. కానీ ఆస్కార్ మాత్రం వరించలేదు..ఇక తర్వాత 2009లో కూడా టాపిక్ థండర్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కూడా నామినేట్ అయ్యారు.. అక్కడ కూడా నిరాశే మిగిలింది.. అలా రెండుసార్లు చివరి వరకు వెళ్లి వెను తిరిగి వచ్చారు రాబర్ట్ డౌనీ.. దీంతో ఆస్కార్ అవార్డు కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నారు రాబర్ట్ డౌనీ.. మరోవైపు తనకు పేరు తెచ్చి పెట్టిన ఐరన్ మ్యాన్ సినిమాల తరఫున అయిన అవార్డు వస్తుందని కలగన్నాడు.. కానీ ఏదీ కూడా ఆయనకు అవార్డుని అందించలేదు..

ఓపెన్ హైమర్ తో వరించిన అదృష్టం..
కానీ 2024లో ఓపెన్ హైమర్ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నామినేట్ అవ్వగా ఊహించని విధంగా ఆయనకు ఆస్కార్ అవార్డు లభించింది . 96వ అకాడమీ అవార్డుల్లో స్టెర్లింగ్ బ్రౌన్ , రాబర్ట్ నీరో, ర్యాన్ గోస్లింగ్, మార్క్ రఫాల్లా తోపాటు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులకు పోటీపడిన రాబర్ట్ డౌనీ ఓపెన్ హైమర్ సినిమాతో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.. దీంతో రాబర్ట్ డౌనీ పట్టరాని సంతోషంతో ఉన్నారు.. ఇకపోతే బెస్ట్ యాక్టర్ గా వస్తుందని ఇన్ని రోజులు అనుకోగా.. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

రాబర్ట్ డౌనీ పై ప్రశంసలు..
ఒకానొక సమయంలో అసలు ఆస్కార్ వస్తుందో లేదో లైఫ్ లో అని కూడా బాధపడ్డారు.. ఎంతో కష్టపడ్డారు.. ఆస్కార్ కోసం ఎంతో శ్రమించారు.. అంతకుమించి కలలు కన్నారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకోవడంతో పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు రాబర్ట్ డౌనీ.. ఇక 54 సంవత్సరాల సుదీర్ఘ కలకి నేడు శుభం కార్డు పలుకుతూ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఐరన్ మాన్ కి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే ఇన్ని సంవత్సరాల కల ఎట్టకేలకు నేటితో నెరవేరడం ఆయన జీవితంలో ఇదొక మధురమైన ఘట్టం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు