Sree Mukhi: పెళ్లికూతురుల రెడీ అయిన శ్రీముఖి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్లతో పాటు కొన్ని సైడ్ పాత్రలు కూడా ఇండస్ట్రీలో హైలెట్గా నిలుస్తాయి. అంతేకాదు హీరోయిన్ల పక్కన ఉండే నటీనటులు లేదా హీరోల పక్కన ఉండే నటులు కూడా పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే కొంతమంది సినిమాలు చేస్తూనే యాంకరింగ్ కూడా చేస్తారు. అలాంటి వారిలో శ్రీముఖి ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖికి ఉన్న ప్రత్యేకత అంతా కాదు. బొద్దుగా ఉన్నప్పటికీ చాలా అందంగా ఉంటుంది శ్రీముఖి. అలాగే తెలంగాణ యాస భాషలో మాట్లాడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కనువిందు చేస్తుంది. ముఖ్యంగా జులాయి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది శ్రీముఖి. ఇక ఆ తర్వాత ఎక్కువ శాతం యాంకర్ గెటప్ లోనే కనిపించింది.

పటాస్ షో తో పాపులారిటీ

- Advertisement -

యాంకర్ శ్రీముఖి ఎన్నో షోలు చేస్తూ ఉంటుంది. కానీ శ్రీముఖికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చింది పటాస్ షో మాత్రమే. ఈ షోలో యాంకర్ రవితో పాటు కలిసి చేసేది శ్రీముఖి. దీంతో యాంకర్ రవి మరియు శ్రీముఖి మధ్య ఏదో ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా తన టాలెంట్ నిరూపించుకుంది శ్రీముఖి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అలాగే యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు.

గ్లామర్ షో

యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది యాంకర్ శ్రీముఖి. అలా ఇప్పటికే చాలాసార్లు తన అందాలను ఆరబోసింది. ఇక లేటెస్ట్ గా సంప్రదాయ పద్ధతిలో అచ్చం పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది శ్రీముఖి. బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఒళ్లంతా నగలు వేసుకొని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు