Sreemukhi : ఆమెకేం అనిపించిందో… శ్రీముఖి ముద్దులపై శేఖర్ మాస్టర్ కామెంట్స్

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి టాలీవుడ్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “ఢీ” అనే డ్యాన్స్ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన అదే షోకి జడ్జిగా వ్యవహరించే రేంజ్ కి ఎదిగారు. ఇప్పటిదాకా టాలీవుడ్లో మెగాస్టార్ తో సహా పలువురు స్టార్ హీరోలతో విజిల్స్ వేసే స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూనే, మరోవైపు బుల్లితెరపై పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. డాన్స్ షో “ఢీ”తో పాటు పలు కామెడీ షోలలో శేఖర్ మాస్టర్ సందడి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారమైన “కామెడీ స్టార్స్” షోకి శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరించగా, హాట్ యాంకర్ శ్రీముఖి స్టేజ్ పై ఏకంగా ఆయనకు ముద్దు పెట్టేసింది. అప్పట్లో ఆ విషయం తెగ వైరల్ అయ్యింది. ఇక మీమర్స్ కు కూడా మంచి స్టఫ్ దొరికినట్టు కావడంతో ఇష్టమొచ్చినట్టుగా ట్రోల్ చేశారు. తాజాగా శేఖర్ మాస్టర్ శ్రీముఖి ముద్దు గురించి స్పందించారు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఢీ షోకి జడ్జిగా వెళ్ళినప్పుడు తనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చాలామంది చెప్పేవారని చెప్పుకొచ్చారు. అయితే రాను రానూ దాన్నే శేఖర్ మాస్టర్ కు అమ్మాయిలు అంటే ఇష్టం అన్నట్టుగా మార్చేశారు అనే విషయాన్ని వెల్లడించారు. ఆ క్రమంలోనే ఎప్పుడైనా రష్మీ, అనసూయ లాంటి యాంకర్స్ తో డాన్స్ చేస్తే అందరూ ఆటపట్టించేవారని, అలాగే తనకు రోజా గారు అంటే ఇష్టమని, ఆమెతో డాన్స్ చేస్తున్నప్పుడు కూడా అలాగే అనేవారని శేఖర్ మాస్టర్ తెలిపారు. ఇక మొన్న స్టేజ్ మీద శ్రీముఖికి ఏమనిపించిందో ఏమో గాని సాంగ్ వచ్చిందని చెప్పి ముద్దు పెట్టేసిందని, కానీ దాని గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా రాసారని అన్నారు. అయితే ఆమె ముద్దు పెడితే నేనేం చేస్తా చెప్పండి? అంటూ శేఖర్ మాస్టర్ తిరిగి ప్రశ్నించాడు. అదేదో సరదాగా అలా జరిగిపోయింది అంటూ నవ్వేశారు.

ఇక తనకు హీరోగా ఛాన్స్ వచ్చిందని, కానీ కొరియోగ్రఫీ అంటేనే ఇష్టమని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ వెల్లడించారు. అలాగే డ్యాన్స్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏంటి ? అని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ… డాన్స్ షోలలో ఓన్లీ డాన్స్ మాత్రమే ఉంటుందని, కానీ స్కిట్స్ లో మాత్రం ఏదైనా చిన్న మసాలా ఉంటేనే కామెడీ పండుతుందనే ఉద్దేశంతో వాళ్లు అలా చేస్తారని అన్నాడు. ఒకవేళ ఏదైనా డబుల్ మీనింగ్ అనిపిస్తే ఆఫ్ ది రికార్డ్ చెప్తామని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు