Game changer : సాంగ్ తో సరిపెడతారా? ఆ ముచ్చట కూడా?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. శంకర్ షణ్ముగం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై మెగా అభిమానులు  భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఇక రీసెంట్ టైం లో మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అందుకే మెగాభిమానులు ఈ సినిమాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలై నాలుగేళ్లకు చేరువవుతున్నా రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ దిల్ రాజు కూడా తప్పించుకుంటూనే వస్తున్నాడు.

బర్త్ డే స్పెషల్ ట్రీట్..

అయితే చాలా రోజుల నుండి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సరిగ్గా ఏడాది కింద రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి సింపుల్ గా వదిలి టైటిల్ అనౌన్స్ మెంట్ చేసారు. ఇక ఇప్పటివరకూ మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ అప్పుడప్పుడు లీక్ అయిన స్టిల్స్ మాత్రం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చాయి. ఇక ఆ మధ్య దీపావళి సందర్బంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నామని అన్నా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పడు మళ్ళీ ఐదు నెలల తర్వాత రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే టీజర్ వస్తుందని చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తుంటే, ఆల్రెడీ లీక్ అయిన సాంగ్ ని అఫిషియల్ గా రిలీజ్ చేస్తూ పెద్దగా ట్రీట్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు మేకర్స్ అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కనీసం ఆ అప్డేట్ అయినా..

ఇకపోతే గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రామ్ చరణ్ బర్త్ డే రోజు నిరాశ తప్పేలా లేదు. పైగా మరో సినిమా కూడా రామ్ చరణ్ స్టార్ట్ చేయలేదు. అయితే చరణ్ బర్త్ డే రోజు సాంగ్ ని మాత్రమే లాంచ్ చేయకుండా, కనీసం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అయినా చేయమని సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సాంగ్ ఎలాగూ లీక్ అయింది కాబట్టి, ఇప్పుడు అఫిషియల్ గా రిలీజ్ చేసినా విజువల్స్ బాగుంటే తప్ప మెప్పించడం కష్టం. అయితే ఫ్యాన్స్ ఎదురుచూస్తుంది మాత్రం రిలీజ్ డేట్ కోసమే అని అందరికి తెలిసిందే. ఈ అప్డేట్ గనుక చెప్పేస్తే ఫ్యాన్స్ క్లారిటి తో ఉంటారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కూడా చేస్తారా? లేదా సాంగ్ తో సరిపెడతారా అనేది తెలియాలంటే రామ్ చరణ్ బర్త్ డే (మార్చి27) వరకూ వెయిట్ చేయాల్సిందే.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు