Animal : అనిమల్ బ్యూటీ రెమ్యూనరేషన్ ఇంతేనా?

బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ మూవీల్లో అనిమల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా ఎగబడి చూసారని తెలిసిందే. దానికి కారణం సందీప్ రెడ్డి వంగ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లకి చేరువగా వచ్చి ఆగిపోయిన ఈ సినిమాలో రణబీర్ సింగ్ అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించిందన్న విషయం తెలిసిందే. అయితే అనిమ‌ల్ సినిమాలో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నానే అయినా కూడా, ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత త‌క్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువ‌గా జ‌నాల దృష్టిలో ప‌డింది మాత్రం త్రిప్తి దిమ్రినే. బాలీవుడ్ లో చాలా మందికి ఈ హాట్ బ్యూటీ క్రష్ గా మారింది.

తక్కువ స్పేస్ ఎక్కువ ఇంపాక్ట్..

అయితే అనిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి సెకండ్ హీరోయిన్ కూడా కాకపోయినప్పటికీ ఆ రేంజ్ ఇంపాక్ట్ ని ఇచ్చింది. హీరోయిన్ గా రష్మిక మందన్న ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. కానీ తన గ్లామర్ షో తో రష్మిక ని మించి క్రేజ్ దక్కించుకుంది త్రిప్తి. ఇక ఈ సినిమాలో ఆమె మ‌హా అయితే ఓ 20 నిమిషాలు క‌నిపిస్తుందేమో. కానీ జోయా పాత్ర‌లో ఆమె ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం చాలా బ‌ల‌మైంది. త్రిప్తి దిమ్రి గ్లామర్ కూడా బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, త‌న‌తో ర‌ణ‌బీర్ చేసిన ఇంటిమేట్ సీన్ల‌కు కుర్రాళ్లు బాగా క‌నెక్ట్ అయ్యారు. ఇక యానిమ‌ల్ రిలీజైన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో త్రిప్తి బాగా ట్రెండ్ అవుతూ వ‌స్తోంది.ఇక అనిమల్ తర్వాత ఆమెకు వరుస సినిమా అవ‌కాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో భూల్ భుల‌యా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న త్రిప్తి త్వరలో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కూడా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

కేవలం నలభై..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందర్నీ కట్టిపడేసిన త్రిప్తి దిమ్రి కి రెమ్యూనరేషన్ ఈ సినిమాతో ఎంత వచ్చి ఉంటుంది అని చాలా మంది లెక్కలు వేశారు. కనీసం 2 నుండి 3 కోట్ల వరకు త్రిప్తి కి రెమ్యూనరేషన్ మేకర్స్ ఇచ్చి ఉంటారని నెటిజన్లు భావించారు. అయితే తాజాగా త్రిప్తి రెమ్యూనరేషన్ గురించి అప్డేట్ అయితే వచ్చింది. త్రిప్తికి యానిమ‌ల్ సినిమాలో న‌టించినందుకు కేవ‌లం రూ.40 ల‌క్ష‌లు మాత్ర‌మే పారితోష‌కం కింద ఇచ్చార‌ట‌. ఎందుకంటే ఈ సినిమా చేసేట‌ప్ప‌టికి త్రిప్తి ఎవ‌రో కూడా జనాలకి తెలియ‌దు. కొత్త‌మ్మాయి.. పైగా త‌క్కువ నిడివి ఉన్న పాత్ర‌. కాబ‌ట్టి త‌క్కువ పారితోష‌కానికే ఒప్పుకుందట. కానీ యానిమ‌ల్ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ట‌యి త్రిప్తి పేరు ఇండియా వైడ్ గా ట్రెండ్ అయింది. మనీ పరంగా ఆమెకు త‌క్కువ ఇచ్చార‌ని అనిపిస్తుంది కానీ, ఆ సినిమా వ‌ల్ల వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల‌తో త్రిప్తి కెరీరే మారిపోయింది. ఇప్పుడు త్రిప్తి ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. ఒకవేళ స్పెషల్ సాంగ్ అయితే కోటి వరకూ ఛార్జ్ చేస్తుందట.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు