Animal: డబ్బులు తో పాటు అవార్డులు కూడా

Animal:  సందీప్ రెడ్డి వంగ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. అప్పట్లో శివ సినిమా ఎటువంటి సంచలనం సృష్టించిందో, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అటువంటి సంచలన సృష్టించింది. అప్పట్లో శివ ఇప్పట్లో అర్జున్ రెడ్డి అంటూ చాలామంది ప్రశంసలు కూడా కురిపించారు. అలానే ఒక మాములు కథను అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ టేకింగ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా ఆడియన్స్ కి ఒక మెస్మరైజింగ్ ఫీల్ ని క్రియేట్ చేశాయి. అందుకే అర్జున్ రెడ్డి సినిమా ఆ స్థాయిలో హిట్ అయింది.

ఆ సినిమాతో విజయ్ దేవరకొండ స్థాయి కూడా మారిపోయింది. అదే సినిమాని మళ్లీ హిందీలో చేసి కబీర్ సింగ్ తో సంచలనం సృష్టించాడు సందీప్. అయితే కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్నో బాలీవుడ్ వెబ్సైట్స్ ఆ సినిమాని కించపరుస్తూ ఇదొక వైలెంట్ సినిమా అంటూ తొక్కే ప్రయత్నం చేశారు. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టి దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లను ఇచ్చారు. ఇకపోతే అదే సమయంలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ నా సినిమాను వీళ్ళు వైలెంట్ ఫిలిం అంటూ రాసుకొచ్చారు. వీళ్ళకి నేను చూపిస్తాను అసలైన వైలెంట్ ఫిలిం ఏంటి అని అంటూ ఆ రోజుల్లోనే శపథం చేశాడు.

చెప్పిన మాట ప్రకారం రన్బీర్ సింగ్ తో అనిమల్ సినిమా తెరకెక్కించాడు. అనిమల్ సినిమా మొదటి రోజు నుంచి ఎన్నో విమర్శలను అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది. అసలు సినిమా యొక్క రూపురేఖలను మార్చి సినిమాకి బారి గేట్స్ లేవు అంటూ సినిమాను ఇలా కూడా తీయొచ్చు అంటూ సందీప్ రెడ్డి వంగ నేర్పించాడు. అనిమల్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా కాదు. రీసెంట్గా ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదలైంది. అయితే ఈ సినిమాలో ప్రతి సీన్ ని కట్ చేస్తూ దానిపైన డిస్కషన్స్ పెడుతున్నారు చాలామంది సినీ ప్రేమికులు.

- Advertisement -

అనిమల్ సినిమా కేవలం కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా, ఈ సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. ఇప్పటివరకు అనిమల్ సినిమాకి ఐదు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. దాంట్లో బెస్ట్ యాక్టర్ గా రన్బీర్ కపూర్ కి, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ సౌండ్ డిజైన్ ఇలా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఒక సినిమా కమర్షియల్ గా హిట్ అవుతూ కూడా అవార్డులను సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా సందీప్ రెడ్డివంగా తన స్టామినా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేశాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు