Vijay Devarakonda : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న “ఫ్యామిలీ స్టార్”… సంక్రాంతి రేసులో ఉండుంటే..

Vijay Devarakonda :  ఎన్ని డిజాస్టర్లు పడినా క్రేజ్ తగ్గని హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండనే. ఈ హీరోకు చాలా కాలంగా సరైన హిట్ లేకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈసారి హిట్ అందుకునే మంచి ఛాన్స్ ను విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ హీరో గనుక సంక్రాంతి రేసులో ఉండుంటే అదృష్టం కలిసి వచ్చి ఉండేదేమో.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు అనుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవాలనేది ఆయన ప్లాన్. కానీ అప్పటికే పెండింగ్లో ఉన్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కష్టమని ఆయన అర్థం చేసుకున్నారు.

దీంతో ఈ సినిమాను 2024లో రిలీజ్ చేయాలని భావించి సంక్రాంతి రేసు నుంచి “ఫ్యామిలీ స్టార్”ను పక్కకు తప్పించారు. అసలే హిట్ కోసం పరితపిస్తున్న విజయ్ దేవరకొండ కూడా సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని హడావిడిలో సినిమాను తీయొద్దని సలహా ఇచ్చాడట. మొత్తానికి హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరూ కలిసి ఈ సినిమాను వాయిదా వేశారు.

- Advertisement -

కానీ దానివల్ల సంక్రాంతి లాంటి ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ప్రశాంత్ వర్మ “హనుమాన్” మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు హీరోగా నటించిన “గుంటూరు కారం” మూవీ యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ” సైంధవ్” కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. మరోవైపు నాగార్జున నటించిన “నా సామి రంగ” మూవీ బీ,సీ సెంటర్లలో బాగా ఆడుతోంది.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే “ఫ్యామిలీ స్టార్” సంక్రాంతి బరిలోకి దిగితే బాగుండేది అంటున్నారు రౌడీ హీరో అభిమానులు. పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో ఈజీగా హిట్ కొట్టి ఉండేవారనీ, ఒకవేళ “హనుమాన్” మూవీ ఇదే రేంజ్ లో దూసుకెళ్లినా కూడా “ఫ్యామిలీ స్టార్” కనీసం రెండవ స్థానంలోనైనా నిలిచి ఉండేదనీ అంటున్నారు. కానీ రిలీజ్ విషయంలో మొత్తానికి విజయ్ దేవరకొండ, “ఫ్యామిలీ స్టార్” తీసుకున్న నిర్ణయంతో ఈ సంక్రాంతికి హిట్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు