Kalki 2898 AD: ఇక్కడ తొక్కుకుంటా పోతుంది.. కానీ, హాలీవుడ్‌లో పరిస్థితి ఇలా ఉందేంటి?

కల్కీ మే 9న రిలీజ్ కాబోతుందని అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దీంతో ఇప్పటి వరకు మేలో ప్లాన్ చేసుకున్న తెలుగు సినిమాలన్నీ కూడా వాయిదా వేసుకోవడానికి మరో డేట్ ను చూసుకుంటున్నాయి. కల్కీ దెబ్బకు కేవలం తెలుగు సినిమాలు కాదు… ఇండియాలో ఒక్క సినిమా కూడా మే రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ, రిలీజ్ చేయడానికి ధైర్యం చేయకపోవచ్చు. కల్కీకి ఉన్న హైప్ అలాంటిది మరి.

ఇండియాన్ బక్సాఫీస్ దగ్గర కల్కీకి పోటీ లేకపోవడం ప్లస్ పాయింటే. కానీ, దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో వస్తున్న కల్కీకి ఇది సరిపోదు. ఎందుకంటే.. కల్కీ సినిమాను ఓ హాలీవుడ్ సినిమాల్లా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఇంటర్నెషనల్ స్టేజ్‌లపైనే విడుదల చేశారు. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు.

అవును మరీ… 600 కోట్ల బడ్జెత్ వచ్చే మూవీని ఒక మన దేశంలోనే రిలీజ్ చేస్తే ఇప్పుడిప్పుడే కోలుకుటున్న వైజయంతీ మూవీస్‌కు కోట్ల నష్టం తప్పదు. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. ఒకటి కాదు.. రెండు అని చెప్పొచ్చు. అవి ఏంటంటే…? హాలీవుడ్ మూవీస్.

- Advertisement -

మేలోనే హాలీవుడ్ నుంచి రెండు మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అవే.. Furiosa: A Mad Max Saga, Kingdom of the Planet of the Apes. ఈ రెండు ఫ్రాంచైజీలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర దేశాల గురించి కాదు… మన దేశంలో కూడా ఈ సినిమాలంటే పిచ్చిగా వెయిట్ చేస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే, ఈ రెండు సినిమాలు మన దేశంలో కల్కీకి పెద్దగా పోటీ రాకపోవచ్చు. కానీ, కల్కీ టీం ఎక్కువగా నమ్ముకున్న ఇతర దేశాల బాక్సాఫీస్ కలెక్షన్లపై తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది.

Furiosa: A Mad Max Saga ఇది 2015లో వచ్చి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 4000 వేల కోట్లు కలెక్ట్ చేసి Mad Max: Fury Road మూవీకి ప్రీక్వెల్‌గా రాబోతుంది. అలాగే Planet of the Apes ప్రాంచైజీలో నాలుగో మూవీగా వస్తున్న Kingdom of the Planet of the Apesపై కూడా భారీ స్థాయిలో హైప్ ఉంది. ఇలాంటి రెండు హాలీవుడ్ బిగ్ మూవీస్ మధ్య కల్కీకి ఇతర దేశాల్లో పెద్దగా కలెక్షన్లు రావడం కష్టమే అని టాక్ వస్తుంది.

అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్… మాత్రం హాలీవుడ్ సినిమాలకు దీటుగా కల్కీకి ప్రమోషన్స్ చేస్తున్నాడు. దీంతో ఆ రెండు హాలీవుడ్ మూవీలను కూడా కల్కీ ఎదుర్కొంటుందని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు