Raja Saab : మారుతిపై పాన్ ఇండియా ప్రెజర్… మ్యానేజ్ చేయగలడా?

Raja Saab : డైరెక్టర్ మారుతి… ఈ పేరు వినగానే ఈరోజుల్లో, బస్స్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్తజంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇలాంటి చిన్న సినిమాల నుంచి మిడ్ రేంజ్ సినిమాలకు మారుతి పర్ఫెక్ట్ డైరెక్టర్ అన్న విషయం గుర్తొస్తుంది. ఇప్పటిదాకా కేవలం చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకే పరిమితమైన ఈ దర్శకుడు ఇప్పుడు “రాజా సాబ్” వంటి పాన్ ఇండియా సినిమా బాధ్యతలను తలకెత్తుకున్నాడు. మరి ఈ పాన్ ఇండియా ప్రెజర్ ను మారుతి మేనేజ్ చేయగలడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్”. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ నల్ల చొక్కా, రంగురంగుల లుంగీ ధరించి అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చాడు. ఈ మూవీ ఇప్పటిదాకా ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ను మారుతీ ఈ సినిమా ద్వారా బయట పెడతాడని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇంత పెద్ద సినిమాను చిన్న సినిమాల డైరెక్టర్ అయిన మారుతి అసలు మ్యారేజ్ చేయగలడా అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. దానికి కారణం ఆయనపై ఉన్న ఫ్యాన్ ఇండియా ప్రెజర్. నిజానికి ఈ దర్శకుడు గత రెండు మూడు ఏళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ మారుతి ప్యాన్ ఇండియా సినిమాను చేయడానికి ప్రయత్నించడం కొత్త అనుమానాలు తెరపైకి రావడానికి కారణమైంది.

- Advertisement -

పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చేయగల సత్తా మారుతికి ఉందా అంటే అనుమానమే. గతంలో వెంకటేష్ లాంటి సీనియర్ హీరోనే హ్యాండిల్ చేయలేకపోయాడు. వెంకటేష్, మారుతి కాంబోలో వచ్చిన “బాబు బంగారం” సినిమా డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. వెంకటేష్ రీజనల్ హీరో. కానీ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్. అయితే మారుతి తనను తాను నిరూపించుకోవడానికి “ది రాజా సాబ్” మూవీ మంచి అవకాశం అవుతుంది. ఈ మూవీ గనక హిట్ అయితే పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా హ్యాండిల్ చేయగల సత్తా దర్శకుడుగా తనకు ఉందనే విషయాన్ని “రాజా సాబ్” తో మారుతి నిరూపించుకోవచ్చు.

అయితే ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. ఇతర భాషల ప్రేక్షకులు కూడా ప్రభాస్ సినిమా గురించి ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించడం అనేది ఇప్పుడు మారుతి ముందున్న అతి పెద్ద సవాల్. మరి ఈ సినిమాతో మారుతి ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ను ఇస్తాడు? తాను ఎలాంటి పేరు తెచ్చుకుంటాడు? అనేది తెలియాలంటే “రాజా సాబ్” థియేటర్లలోకి వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు