Ruhani Sharma : బ్లౌజ్‌ లేకుండా… చీరలో అందాలు ఆరబోసిన రుహానీ !

Ruhani Sharma :  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే బాగా పాపులర్ అయ్యారు. అలా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన వారిలో రుహానిశర్మ ఒకరు. తన మొదటి సినిమా చి.ల.సౌ తోనే సూపర్ హిట్ అందుకుంది రుహాని శర్మ. అంతేకాదు మొదటి చిత్రంతోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కి జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత హిట్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. అయితే చూడడానికి ఎంతో చక్కగా ఉన్నా ఈ హీరోయిన్ కి ఎందుకో ఇంకా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు రావడం లేదు. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాని శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది రుహాని. నటిగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు.

దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. రుహాని సోషల్ మీడియాలో జోరు చూస్తుంటే రోజురోజుకు ఆమె అందం రెట్టింపు అవుతుంది అనిపిస్తుంది. తాజాగా బ్లౌజ్ లేకుండా గ్రీన్ కలర్ శారీలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరువపు అందాలని ప్రదర్శిస్తూ కుర్రవాళ్ళ గుండెల్లో సెగ పెడుతుంది. కాగా ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న ‘సైంధవ్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించింది. శైలేష్ కొలను దర్శకత్వం లో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించగా… శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

Ruhani Sharma : Without blouse..Ruhani looking beautiful in saree!

Ruhani Sharma : Without blouse..Ruhani looking beautiful in saree!

Ruhani Sharma : Without blouse..Ruhani looking beautiful in saree!

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు