Ruhani sharma: టాలీవుడ్ హీరోయిన్ తో విరాట్ కోహ్లీ ఆ రిలేషన్…!

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. ఈ జోడికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి అనుష్క శర్మ వివాహ అనంతరం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం లేదు. కానీ అనుష్క శర్మ చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అన్న సంగతి ఎవరికీ తెలియదు.

ఈ అమ్మడు మాత్రం తెలుగులో చాలా మంచి మంచి పాత్రలు చేసుకుంటూ తన అందంతో ప్రేక్షకులకు దగ్గర అయింది రూహాని శర్మ. ఈ భామ మొదటగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను నటించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులు అందరినీ మెప్పించింది. ఈ సినిమా అనంతరం వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషచిత్రాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. రుహాని సినిమాలతో పాటు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రూహాని తన లైఫ్ స్టైల్, మూవీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన చిన్న వయసు నుంచి వెంకీ సినిమాలను చూసుకుంటూ పెరిగానని… వెంకటేష్ తో నటించిన తర్వాత అతనికి పెద్ద అభిమానిని అయ్యానని… తనతో సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ రుహాని చెప్పుకొచ్చింది. తనకు చిన్ననాటి నుంచే డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అంటూ… ఇప్పుడు సైంధవ్ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు అనుష్క శర్మతో మీ బంధం ఎలా ఉంటుంది అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా… రుహాని ఒక్కసారిగా షాక్ అయింది. ఈ విషయాన్ని ఎప్పుడూ, ఎక్కడా మీడియా ముందు నేను చెప్పలేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని ప్రశ్నించింది. ఇక ఆ తర్వాత అనుష్క శర్మ నాకు అక్క అవుతుందని, విరాట్ బావ అవుతాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రుహనీ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు