Guntur Kaaram : దడ పుట్టిస్తున్న 1AM షో టికెట్ రేట్లు… ఇలాగైతే థియేటర్లకు జనాలు వచ్చినట్టే!

“గుంటూరు కారం” మూవీ స్పెషల్ షోల టికెట్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. భారీ రేంజ్ లో పెంచేసిన ఈ టికెట్ ధరలు చూస్తే ఆడియన్స్ థియేటర్ల దగ్గర నుంచి పారిపోవడం ఖాయం. హైదరాబాదులోని కొన్ని థియేటర్లలో వేలల్లో “గుంటూరు కారం” మూవీ స్పెషల్ షోల టికెట్లను అమ్ముతున్నారు. ఇంతకీ “గుంటూరు కారం” 1 AM షోల టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే…

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు తెలంగాణలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కొంతమంది థియేటర్ల యజమానుల నుంచి థర్డ్ పార్టీలు భారీ మొత్తంలో ఈ షోలను కొనుగోలు చేశాయి. అయితే వాళ్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడానికి స్పెషల్ షోల టికెట్లను భారీ ధరలకు విక్రయిస్తున్నారు. 1AM కి వేసే “గుంటూరు కారం” స్పెషల్ షోలకు టికెట్ ధరలు రూ. 2000, 2500 గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని చూస్తే స్పెషల్ షోలకు పెంచిన టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల 2000 పెట్టి స్పెషల్ షోలను చూసే కన్నా, ఆ తర్వాత మూవీ చూస్తే 500తో పోతుంది అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. ఇంతటి భారీ రేట్లు పెడితే మహేష్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మరి ఇంతటి భారీ టిక్కెట్ రేట్లు పెట్టి “గుంటూరు కారం” మూవీ స్పెషల్ షోలను థియేటర్లో చూడడానికి ఆడియన్స్ వస్తారా ? అనేది చూడాలి.

ఇదిలా ఉంటే మరోవైపు “గుంటూరు కారం” మూవీ 4AM షోలకు సంబంధించిన టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. కాగా “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మహేష్ అభిమానులు ఫుల్ గా ఎక్సైట్ అవుతున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని నమ్ముతున్నారు. మరోవైపు థియేటర్ల ఇష్యూ నడుస్తోంది. దీనివల్ల సోషల్ మీడియాలో “గుంటూరు కారం” వర్సెస్ “హనుమాన్” మూవీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి రేపు రిలీజ్ కాబోతున్న “గుంటూరు కారం” మూవీకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు