Gutnur Kaaram : టికెట్ రేట్ల ఘాటు… “సలార్” కంటే “గుంటూరు కారం” ఏ రకంగా ఎక్కువ?

సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న “గుంటూరు కారం” మూవీ టికెట్ల రేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. అయితే పెరిగిన రేట్లపై ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ “గుంటూరు కారం” మూవీ టికెట్ రేట్లు ఎంత వరకు పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చాయి? “సలార్” కంటే “గుంటూరు కారం” మూవీకి ఎక్కువ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం ఏ రకంగా సబబు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులను ఇస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం రోజు జీవో జారీ చేసింది. ఏపీలో “గుంటూరు కారం” సినిమా రిలీజ్ అయిన మొదటి పది రోజులపాటు టికెట్ల ధరలను రూ.50 పెంచుకోవడానికి అనుమతి లభించింది. తెలంగాణతో పోలిస్తే కాస్త ఆలస్యంగానే ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడే ఓ వర్గం వారు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా “సలార్”కు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో రూ.40 మాత్రమే పెంచుకోవడానికి అంగీకరించింది. కానీ ఒక రీజనల్ నార్మల్ మూవీ “గుంటూరు కారం”కు మాత్రం రూ.50 హైక్ కు అనుమతి ఇవ్వడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలోనూ “గుంటూరు కారం” మూవీకి భారీగా టికెట్ ధరలు పెరిగాయి. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ లలో రూ.65, మల్టీప్లెక్స్ లలో రూ. 100 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఈ లెక్కలను బట్టి చూస్తే మల్టీప్లెక్స్ లో టికెట్ ధర గరిష్టంగా రూ. 470, సింగిల్ స్క్రీన్ లలో రూ. 270 వరకు పెరుగుతుంది. తెలంగాణలో “గుంటూరు కారం” మూవీకి ఉన్న మరో బెనిఫిట్ ఏమిటంటే మొదటి వారం రోజులపాటు 6 షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పెషల్ షోలు వేయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఫాన్స్ హడావిడి మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “గుంటూరు కారం” మూవీ గురించే డిస్కషన్ నడుస్తోంది. “హనుమాన్” మూవీతో గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో రిలీజ్ కాకముందే “గుంటూరు కారం” మూవీ బ్లాక్ బస్టర్ అంటూ సందడి చేస్తున్నారు మహేష్ అభిమానులు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు