Ashok Galla: ఈసారైనా గట్టిగా కొడదామని సెంటిమెంట్ తో వస్తున్నాడు..

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్లలో మరి కొందరు ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. అయితే వాళ్లలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంత ఎక్కువ కాలం ట్రై చేసే అవకాశం వస్తుంది. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే హీరోలు చాలా తక్కువ. ఇక అలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నాడు అశోక్ గల్లా. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ వారసుడికి తండ్రి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఇంకా, మహేష్ బాబు మేనల్లుడు కావడంతో అవకాశాలు ఈజీ గా వచ్చాయి.

కానీ ఈ హీరో తొలి ప్రయత్నం లోనే విఫలమయ్యాడు. ఈ హీరో నటించిన ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ గా నిలిచింది. 2022 లో హీరో అనే సినిమాలో నటించిన అశోక్ గల్లా డిజాస్టర్ ని చవిచూశాడు. అయితే ఇప్పుడు కొంచెం మెళకువలు నేర్చుకుని రెండో ప్రయత్నంగా కమర్షియల్ సెంటిమెంట్ కి డివోషనల్ అటాచ్మెంట్ కూడా యాడ్ చేసి తెస్తున్నాడు. “దేవకీనందన వాసుదేవ” అనే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది.

ఇక ఆ టీజర్ లో మామూలుగా తెలుగు సినిమాల్లో ఉండే కథా, కథనాలే ఉన్నట్టు కనిపించగా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే ప్రతిభ ఏమైనా చూపిస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్ పై బాలకృష్ణ.ఎస్ నిర్మిస్తున్నాడు. భీం సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి టీజర్ పరంగా అంతగా ఆకట్టుకోలేని ఈ టీజర్ సినిమా పరంగా ఎంతవరకు మెప్పిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు