Naa Saami Ranga: హీరోయిన్ పై నాగ్ స్పెషల్ కేరింగ్… రోజూ భోజనం పంపిస్తూ ఇలా…

టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి దృష్టి కొత్త హీరోయిన్ ఆషిక రంగనాథ్ పైనే ఉంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న “నా సామి రంగ” మూవీతో ఈ కన్నడ భామ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున తన గురించి స్పెషల్ కేరింగ్ తీసుకున్నాడని, రోజూ ఇంటి భోజనం పంపించారు అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

కర్ణాటక కు చెందిన హీరోయిన్ ఆషిక రంగనాథ్ కు తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా, కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “నా సామి రంగ” మూవీలో ఆషిక రంగనాథ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది హీరోయిన్ ఆషిక.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో “నా సామి రంగ” మూవీ షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇంటి భోజనం ఇష్టపడే ఈ బ్యూటీ హైదరాబాద్ కు వచ్చాక తిండి కోసం ఎలాంటి కష్టాలు పడింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. “నా సామి రంగ” మూవీ షూటింగ్ కోసం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చిన ఆషిక ఒక హోటల్లో బస చేయాల్సి వచ్చిందట. ఆ హోటల్ భోజనం నచ్చక, దాంతోనే సరిపెట్టుకుంటూ కొన్ని రోజులు ఫుడ్ విషయంలో చాలా కష్టపడిందట.

- Advertisement -

అయితే ఒకానొక సందర్భంలో ఈ విషయం నాగార్జున తెలుసుకుని తన పట్ల ఎలాంటి కేరింగ్ తీసుకున్నాడు అనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె హైదరాబాదులో షూటింగ్ కోసం ఉన్నన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వయంగా తన ఇంట్లో వండిన భోజనాన్ని ఆషిక కోసం ప్రత్యేకంగా పంపించారని తెలిపింది. నాగ్ తనపై చూపించిన ఈ స్పెషల్ కేరింగ్ వల్ల ఇంటికి దూరంగా ఉన్నట్టుగా అనిపించలేదని, తనకు ఇలా హైదరాబాదులో రెండవ ఇల్లు ఉండడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జునకు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ కామెంట్స్ తో ఆమె నాగార్జున ఇంటిని, టాలీవుడ్ ను తన రెండవ ఇల్లుగా భావిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక టాలీవుడ్ లోనే హీరోయిన్ గా స్థిరపడాలని ఈ బ్యూటీ డిసైడ్ అయిపోయిందన్నమాట. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు మూడు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. “నా సామి రంగ” మూవీ గనుక హిట్ అయితే మరిన్ని అవకాశాలు ఆషిక ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు