Ram Pothineni: దేవదాస్ @18 యేళ్లు.. వరల్డ్ రికార్డ్ కొట్టిన రామ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జనవరి 11 2006 లో విడుదలైన దేవదాసు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ యువ హీరో నేటికి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 18 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అతి చిన్న వయసులోనే ఎవరు సాధించని ప్రపంచ రికార్డు సృష్టించారు రామ్ పోతినేని. ఇక దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత స్రవంతి రవికిషోర్ కుమారుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దేవదాస్ అనే చిత్రం ద్వారా అతిపెద్ద హిట్ కొట్టి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఖాతాలో ఎవరికీ తెలియని ప్రపంచ రికార్డు ఒకటి ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇది ఏ హీరోలకి కూడా సాధ్యపడలేదు. అదేమిటంటే కేవలం రామ్ తన తొమ్మిదవ తరగతి పూర్తవకముందే అంటే 15 ఏళ్ల వయసులోనే దేవదాసు సినిమాలో నటించడానికి హీరోగా సంతకం చేశారు.

అనేక సందర్భాలలో ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు చెప్పాడు కూడా.. 9వ తరగతి పూర్తవుగానే దేవదాస్ సినిమా చేసినట్టు తెలిపారు.. అంత చిన్న వయసులోనే లీడ్ హీరోగా అడుగుపెట్టిన వాళ్ళలో అంతకుముందు చిత్ర పరిశ్రమలో ఎవరూ లేరు.. ముఖ్యంగా 15 ఏళ్లకే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు ఈ చిత్రం ఆ రోజుల్లోనే కలెక్షన్స్ పరంగా 18 కోట్ల రూపాయల షేర్ కొల్లగొట్టింది. ఇదే కాకుండా విడుదలైన రోజుల్లో 17 కేంద్రాలలో 175 రోజులు ఆడిందంటే మామూలు విషయం కాదు.

- Advertisement -

ముఖ్యంగా హైదరాబాదులోని ఓడియన్ థియేటర్లో ఏకంగా 200 రోజులకు పైగా ఆడింది. ఇలాంటి సినిమా ఇలాంటి నేషనల్ రికార్డు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరికీ లేదని చెప్పడంలో సందేహం లేదు. మొదటి సినిమాతోనే తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, కామెడీ టైమింగ్, డాన్స్ అలాగే ఫైట్స్ తో అందరిని ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలలో నెంబర్ వన్ గా నిలిచారు రామ్.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా రామ్ స్టార్ హీరోల జాబితాలో అడుగు పెట్టబోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డులతో రామ్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు