Raviteja : ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ కు దిగొచ్చిన హీరో… అందుకే కొత్త మూవీ పట్టాలెక్కిందా?

మాస్ మహారాజా రవితేజ రెమ్యూనరేషన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుసగా ఆయన సినిమాలు ప్లాప్ అవుతూ ఉండడంతో రవితేజ మార్కెట్ పడిపోయిందని, ప్రస్తుతం ఆయన డిమాండ్ చేస్తున్నంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడుతున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఈ కారణంగానే ఆయన నటించాల్సిన ఒక సినిమా చేజారిపోయిందని, మరో సినిమా మాత్రం పట్టాలెక్కిందని సమాచారం. రవితేజ హీరోగా చేస్తున్న కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ దిగొచ్చాడని, ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు అని అంటున్నారు.

ఎనర్జిటిక్ గా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు రవితేజ. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంటాడు అనేది ఫిలింనగర్ లో ఉన్న టాక్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా తన పారితోషికాన్ని తీసుకుంటాడట ఈ హీరో. అయితే టాలీవుడ్లో ఈ ఎనర్జిటిక్ హీరోకు ఉన్న మంచి ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగ్, కామెడీ టైమింగ్ కారణంగా ఆయన సినిమాలు ఎలా ఉన్నా కూడా రవితేజ డిమాండ్ కు నిర్మాతలు తలొగ్గక తప్పలేదు. కానీ ఇటీవల కాలంలో ఈ హీరో వరుసగా పరాజయాలను చవి చూస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు ఆయన డిమాండ్లను ఒప్పుకుంటూ వచ్చిన నిర్మాతలు ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో రవితేజ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్లు నిర్మాతల వద్ద చెల్లడం లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజ మార్కెట్ ను మరింతగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సినిమాను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ “మిస్టర్ బచ్చన్” అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా రవితేజ పారితోషికం గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోవడానికి బదులుగా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ కు దిగొచ్చాడట. అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడులు వచ్చేసి, ఆ తర్వాత వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటారన్నమాట. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఇలాగే చేయబోతున్నాడని సమాచారం. ఒకవేళ ఈ మూవీ వాళ్ళు అనుకున్నట్టుగా హిట్ అయితే భారీగానే క్యాష్ చేసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం మెచ్చుకోదగింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు