Tamannah: భారత్ బ్యాన్ చేసిన యాప్ కి ప్రమోషన్… విమర్శలు తట్టుకోలేక ఏం చేసిందంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త వివాదంలో ఇరుక్కుంది. భారత్ బ్యాన్ చేసిన పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ కనిపించడంతో నెటిజన్లు ఈ బ్యూటీపై విరుచుకు పడుతున్నారు. ఇంతకీ బ్యాన్ చేసిన యాప్ లను ప్రమోట్ చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్న తమన్నా ఈ విమర్శలు తట్టుకోలేక ఏం చేసింది? బ్యాన్ చేసిన ఆ యాప్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఇటీవల కాలంలో తమన్నా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె నటిస్తున్న సినిమాల కంటే ఈ మిల్కీ బ్యూటీ గురించి వస్తున్న వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఘాటు శృంగార సన్నివేశాల్లో తమన్నా కనిపించడంతో ఆయా సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. దీంతో చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా తమన్నాకు రోజురోజుకు మరింతగా క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల ‘జైలర్’ మూవీలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ “నువ్వు కావాలయ్యా”, జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి ఏ రేటెడ్ వెబ్ సిరీస్ లలో నటించిన తమన్నా ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం వల్ల ఈ అమ్మడి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు విమర్శలతో ఈ బ్యూటీ మరోసారి ట్రెండ్ అవుతుంది.

తమన్నా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన లోటస్ 365 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో తమన్నా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉన్న యాడ్ ఉంది. ఇక తమన్నా ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా క్షణాల్లో వైరల్ అయిపోయింది ఆ వీడియో. దీంతో ఈ బ్యూటీపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాళ్ళ తిట్లకు తట్టుకోలేక తమన్నా ఏకంగా కామెంట్స్ సెక్షన్ ను తీసేసింది. సెలబ్రిటీలు బాధ్యతతో వ్యవహరించకుండా కేవలం ఇలాంటి వాటివల్ల తమకు వచ్చే డబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. చాలామంది షార్ట్ వీడియోల ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం ఏకంగా ఒక యాడ్ లో కనిపించడం, పైగా ఆ యాడ్ లో లోటస్ 365 బెట్టింగ్ యాప్ ద్వారా మంచి టైం పాస్ తో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చనీ, 50 వేల వరకు డిపాజిట్ చేసిన వాళ్లకు 50 నుంచి 400 శాతం బోనస్ వస్తుందని, లోటస్ 365 యాప్ లో కేసినో ఆడమంటూ తమన్నా ప్రోత్సహించింది.

- Advertisement -

తమన్నా ఈ యాప్ కు ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మేలో లోటస్ 365 ప్రమోషనల్ వీడియోలో పాల్గొంది. అలాగే మరో బ్యాన్ చేసిన బెట్టింగ్ ప్లాట్ ఫామ్ ఫెయిరీ ప్లేకి ప్రచారం చేయడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో 24 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నా ఇలా బాధ్యత లేకుండా బ్యాన్ చేసిన యాప్ లను ప్రచారం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు