Gunturu kaaram: నన్ను రీ లాంచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది – శ్రీ లీల

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే అది శ్రీ లీల అని చెప్పాలి. ఈ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఒక్క ఏడాదికే స్టార్ హీరోయిన్ హోదా దక్కగా, వరుస ఆఫర్లతో దుమ్ములేపుతుంది. ఇక 2023 లో వరుస ప్లాపులు పడ్డా కూడా ఈ అమ్మాయిపై నెగిటివ్ టాక్ రాలేదు. పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక శ్రీ లీల తాజాగా గుంటూరు కారం లో నటించగా, ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన శ్రీ లీల అక్కడ డైరెక్టర్ త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది.

ఇక ఈవెంట్ లో శ్రీ లీల త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఇలా అంది. త్రివిక్రమ్ గారు ఎన్నో పుస్తకాలను, పేజీలను చదివి, వాటన్నిటిని ఒక్క ముక్కలో అర్ధం చెప్పేస్తారు అంటూనే, నన్ను రాఘవేంద్ర రావు గారు ఇంట్రడ్యూస్ చేసారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి, ఇప్పుడు నన్ను త్రివిక్రమ్ గారు గుంటూరు కారం ద్వారా కొత్త శ్రీ లీల ని రీ లాంచ్ చేస్తునట్టు అనిపిస్తుంది, చాలా థ్యాంక్స్ సర్ అని త్రివిక్రమ్ ని పొగిడేసింది.

ఇక ఆ తర్వాత మహేష్ బాబు ని కూడా తన మాటలతో ఇంప్రెస్ చేసింది. ఇక మహేష్ గురించి చెప్ప్పడమంటే శ్రీ లీల ఎలా చెప్తుందో తెలిసిందే. ఇక శ్రీ లీల ఈ ఇయర్ గుంటూరు కారం తో బ్లాక్ బస్టర్ కొట్టి ఈ ఇయర్ ని స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఇక గుంటూరు కారం లో శ్రీ లీల తన డాన్స్ తో ఏ రేంజ్ లో ఇరగదీసిందో ప్రోమోలో చూసాం. మరి థియేటర్లో ఎంత వరకు మెప్పిస్తుందో చూడలంటే జనవరి 12వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు