Lakshmi Menon: ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన విశాల్ బ్యూటీ..!

Lakshmi Menon:  కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన అభిమానులు విశాల్ పెళ్లి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎక్కడ ఏ విషయాన్ని తెలుపలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొంతమంది హీరోయిన్లను వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అభినయశ్రీ అనే హీరోయిన్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి..

ఇప్పుడు తాజాగా మలయాళ హీరోయిన్ అయిన లక్ష్మీ మీనన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. లక్ష్మీ మీనన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. చంద్రముఖి-2 చిత్రంలో కూడా నటించింది. కానీ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.. గత కొద్ది రోజుల నుండి హీరో విశాల్ – లక్ష్మీ మీనన్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తల పై స్వయంగా విశాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఇలాంటి రూమర్స్ పెరిగిపోవడంతో తాజాగా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.

హీరో విశాల్ లక్ష్మీ మీనన్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే రూమర్స్ మొదలు కావడానికి కారణమయ్యింది. అయితే ఇదంతా కేవలం వట్టి రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా లక్ష్మీ మీనన్ కూడా తన ప్రేమ పైన క్లారిటీ ఇస్తూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్కూల్లో ఉన్న సమయంలోనే తన క్లాస్మేట్ తో ప్రేమలో పడ్డానని అయితే మొదట తానే ప్రపోజ్ చేసినా.. ఆ వ్యక్తి కొద్ది రోజుల తర్వాత తన ప్రేమను యాక్సెప్ట్ చేశారని తెలిపింది.

- Advertisement -

అలా తామిద్దరం కొద్ది రోజులు మాట్లాడుకునే వాళ్లమని.. అయితే ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లడంతో తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని అలా ప్రేమ కూడా నెమ్మదిగా తగ్గిపోవడం జరిగిందని తెలిపింది లక్ష్మీ మీనన్ . అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ వేరొకరిని వివాహం చేసుకున్నారని తెలియజేసింది.. ఇలా తన ప్రేమ విషయాన్ని సైతం తెలియజేసింది లక్ష్మీ మీనన్.. చివరిగా ప్రేమించింది కూడా తననే అంటూ కూడా తెలిపింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు