Dilraju: అప్పుడు ఇరుక్కు.. ట్రెండ్.. ఇప్పుడు తాట తీస్తా.. ట్రెండ్..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోతున్న సినిమాల్లో గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక చిత్ర యూనిట్ తో సహా పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమా ఈవెంట్ కి విచ్చేయగా, సుమ యాంకరింగ్ ఈ ఈవెంట్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగానే పెద్ద పెద్ద స్టార్లని కూడా తన పంచ్ లతో ఇరకాటం లో పెట్టే సుమ ఈసారి దిల్ రాజుని ఆడేసుకుంది.

లేటెస్ట్ గా ఓ ఫిల్మ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కి వచ్చిన దిల్ రాజు ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ, సంక్రాంతి మూవీస్ పై, తన పై ఈ సందర్బంగా కొన్ని తప్పుడు వార్తలు రాసిన పలు వెబ్ సైట్లపై మండి పడ్డారన్న విషయం తెలిసిందే. దిల్ రాజు మాట్లాడుతూ, ఆ తప్పుడు రాతలు రాసిన వెబ్ సైట్లకి వార్నింగ్ ఇస్తూ, ఇన్నాళ్లూ ఊరుకున్నాను, ఇక నుండీ నేను ఊరుకోను “తాట తీస్తా” అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు కూడా దిల్ రాజు కొందరికి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది.

అయితే అందులో “తాట తీస్తా” అన్న పదం ఇప్పుడు బాగా వైరల్ అయింది. దాన్ని గుంటూరు కారం ఈవెంట్ లో సుమ హైలెట్ చేసి మరింత వైరల్ చేసింది. ఇక ఆ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ, సంక్రాంతి కి ఈసారి మహేష్ బాబు కలెక్షన్లతో తాట తీస్తాడు అన్నాడు. అయితే లాస్ట్ ఇయర్ ఇలాగే “వారిసు” ఈవెంట్ లో దిల్ రాజు వచ్చి రాని తమిళ్ లో మాట్లాడి, ‘ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు, డాన్స్ వెనుమా ఇరుకు’ అంటూ ట్రెండ్ అయిన దిల్ రాజు, ఈ సారి “తాట తీస్తా” అని మరో సారి ట్రెండ్ అవుతున్నారని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు