NTR: ‘దేవర’ ఆగమనం.. 24 గంటల్లో రికార్డుల మోత..

టాలీవుడ్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటి గా తెరకెక్కుతున్న “దేవర” గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన కాసేపటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దుమ్ములేపింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తాజాగా దేవర 24 గంటలు పూర్తవగా ఈ ఒక్కరోజు రికార్డులో దేవర రికార్డుల మోత మోగించాడని చెప్పాలి. ఇక సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న దేవర మరీ యునానిమస్ రెస్పాన్స్ రాకపోయినా కూడా ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ చాలా వరకు మించిపోయాయి.

ఇక వన్ డే ఓ ఫుల్ జోరు చూపించగా మొత్తం మీద కొత్త రికార్డులు ఏమి నమోదు కాలేదు. కానీ వ్యూస్ పరంగా టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ఈ గ్లిమ్స్ ఇండియా లో సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన గ్లిమ్స్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. 24 గంటలు పూర్తయ్యే సరికి 26.17 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా, 705.7K లైక్స్ ని అందుకుంది.

ఇక టాలీవుడ్ లో వ్యూస్ పరంగా గుంటూరు కారం గ్లిమ్స్ 20.98 మిలియన్ వ్యూస్ ని అందుకుంటే, దీన్ని 8 గంటల్లో దేవర బ్రేక్ చేసింది. అయితే ఇండియా పరంగా పుష్ప2 గ్లిమ్స్ 27.67 మిలియన్ వ్యూస్ ని అందుకోగా దేవర గ్లిమ్స్ టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. ఇక లైక్స్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది దేవర సినిమా… హిందీలో కూడా 18 మిలియన్ వ్యూస్ తో దుమ్ము లేపింది దేవర. అయితే దేవర రిలీజ్ అయ్యే వరకు సాంగ్స్ , టీజర్, ట్రైలర్లతో మరెన్ని రికార్డులుక్రియేట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు