Amardeep: అమర్ దీప్ భార్య తేజు సంపాదన తెలిస్తే షాక్..!

ఈమధ్య కాలంలో బుల్లితెర సెలబ్రిటీలు సీరియల్స్ ద్వారానే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు సీరియల్స్ చేస్తూ మరొకవైపు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవడమే కాదు అంతకుమించి సంపాదిస్తున్నారు కూడా.. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రతినెల రూ.లక్షల సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెర సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో తేజస్విని గౌడ కూడా ఒకరు.

ఈమె కన్నడ నటి అయినప్పటికీ కూడా కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున అలరిస్తోంది. ఇక ఇటీవల కాలంలో మరొక నటుడు అమర్ దీప్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత తెలుగు సీరియల్స్ కి పుల్ స్టాప్ పెట్టిన ఈమె.. కన్నడ , తమిళ్ లో వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా తన కెరియర్ ను గడుపుతోంది. ఇక ఈమె భర్త అమర్దీప్ ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో అమర్దీప్, తేజస్విని దంపతులు ప్రేక్షకులలో మంచి పేరు దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా తేజస్విని గౌడ ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు యూట్యూబ్ ఛానల్ లో కూడా నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతే కాదు ఈ మధ్యకాలంలో తన కెరీర్ పరంగా కాస్త బిజీ అయిన ఈమె కొత్త వీడియోలను చేయలేదు. కానీ ఒకానొక సమయంలో వరుస వీడియోలు చేస్తూ భారీ స్థాయిలో వ్యూస్ సంపాదించేది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో 16 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేసే ఈమె భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకి సుమారుగా రూ.30 లక్షల వరకు ఈమె ఆదాయం ఉంటుందని సమాచారం. ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఈ స్థాయిలో సంపాదిస్తుండడంతో చాలామంది సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు.

- Advertisement -

ఇక తేజస్విని గౌడ నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తోందంటే సంవత్సరానికి రూ.3కోట్ల వరకు సంపాదిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక యూట్యూబ్ ద్వారానే ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారు అంటే అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు