Shobha Shetty: డబ్బు కోసం అలాంటి పని చేస్తున్న మోనిత.. పెద్ద ముదురే..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి శోభా శెట్టి.. మోనిత గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో నటించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.. కార్తీకదీపం సీరియల్ సక్సెస్ లో ఈమె పాత్ర కూడా చాలా కీలకమని చెప్పవచ్చు.. ఇటీవల కార్తీక దీపం-2 ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి భాగంలో ప్రధాన పాత్రలో చేసిన ప్రేమీ విశ్వనాథ్, నిరూపమ్ పరిటాల తిరిగి నటిస్తున్నారు.. అయితే ఇందులో శోభా శెట్టి నటించే అవకాశం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రోమోలో కూడా ఈమె గురించి ఎక్కడ చూపించలేదు.

కాఫీ విత్ శోభా శెట్టి టాక్ షో:
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక శోభా శెట్టి ఒక టాక్ షో చేసింది.. సుమన్ టీవీలో కాఫీ విత్ శోభా శెట్టి అనే పేరుతో ఒక ప్రోగ్రాం ని ప్రారంభించింది.. ఇందులో పలువురు సెలబ్రిటీలను సైతం శోభా శెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది.. దీంతో ఈమె ఎలాంటి సీరియల్స్ ని కూడా ఒప్పుకోలేదట.. వీటితో పాటు ఒక మేకప్ స్టూడియోను కూడా పెట్టుకుంది.. తనకు మేకప్ పైన అవగాహన ఉన్న నేపథ్యంలో చాలామందికి శిక్షణ ఇచ్చి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తోందట.

బిజినెస్ రంగంలోకి అడుగులు వేస్తున్న శోభాశెట్టి:
తాజాగా ఇప్పుడు మరొక బిజినెస్ ని కూడా మొదలు పెట్టింది.. తన ప్రియుడుతో కలిసి హోల్ సేల్ చీరలు కొని ఆ చీరలను తమ కస్టమర్లకు అమ్మేలా ప్లాన్ చేసుకుందట.. దీంతో ఈమె నటనకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపుగా దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోందట శోభా శెట్టి.. సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందని అందుకే బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరొకవైపు ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తోంది..

- Advertisement -

బిగ్ బాస్ లో శోభా శెట్టి:
ఒకవేళ నిజంగానే శోభ శెట్టి నటన మానేస్తే ఖచ్చితంగా ఆమె అభిమానులు సైతం చాలా బాధపడతారు.. బిగ్ బాస్ -7 లో పాల్గొన్న శోభాశెట్టి 14 వారాలపాటు హౌస్ లోనే ఉన్నది.. ఇందులో చాలా నెగెటివిటీ సంపాదించుకోవడంతో వెంటనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది శోభ శెట్టి.. రైతు బిడ్డ అయిన తేజ తో కాస్త లవ్ ట్రాక్ నడిపినప్పటికీ అదంతా కేవలం బిగ్ బాస్ లో భాగంగానే నడిపినట్లు వెల్లడించింది.. ప్రస్తుతం శోభ శెట్టి కి సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది.

మొత్తానికి అయితే సీరియల్స్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి బిజినెస్ రంగంలోకి అడుగులు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు