Shobha Shetty: బిగ్ బాస్ శోభా ఎంగేజ్మెంట్… ఇంత సీక్రెట్ గా ఎందుకో?

Shobha Shetty: బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి తాజాగా తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంగేజ్మెంట్ అనేది మామూలే, కానీ శోభా తన ఎంగేజ్మెంట్ ను సీక్రెట్ గా చేసుకోవడమే ఈ చర్చకు కారణం. ప్రస్తుతం శోభా శెట్టి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చి, తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొన్న అమ్మాయి శోభా శెట్టి. మంచి పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ బుల్లితెర బ్యూటీ బయటకు మాత్రం నెగెటివిటీ తెచ్చుకునే వచ్చేసింది. హౌస్‌లో ఈమె తీరుపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక అక్కడ ఉన్నప్పుడే ఈ అమ్మడు తన సహనటుడు యశ్వంత్ తో ప్రేమాయణం నడుపుతున్న విషయాన్ని బయట పెట్టింది. పైగా శోభాను కలవడం కోసం యశ్వంత్ బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టడంతో ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు మరింత ఆసక్తిని కనబరిచారు. ఇక ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభా తన ప్రియుడితో కలిసి చేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓ సీరియల్ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పెరిగిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా సదరు సీరియల్ సెట్ లోనే శోభా శెట్టి, యశ్వంత్ ప్రేమలో పడ్డారు. అయితే ప్రేమ, పెళ్లి గురించి ముందుగా ప్రపోజ్ చేసింది మాత్రం శోభ శెట్టినేనట. కానీ యశ్వంత్ మాత్రం వెంటనే ఓకే చెప్పలేదని, కొన్నాళ్లు ఆలోచించుకున్న తర్వాత తన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశాడని వివరించిందనే విషయాన్ని స్వయంగా శోభా శెట్టినే వెల్లడించింది. తాజాగా వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

Shobha Shetty: Bigg Boss Shobha engagement... why so secret?

నిజానికి శోభా శెట్టి తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి కొన్నాళ్ల క్రితమే బహిరంగంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక బయటకు వచ్చేసిన శోభా శెట్టి ఓ స్పెషల్ ఈవెంట్లో పాల్గొనగా, ఆ ఈవెంట్ మేకర్స్ యశ్వంత్ ను కూడా అక్కడికి తీసుకువచ్చి ఆమెను సర్ప్రైజ్ చేశారు. ఆ ఈవెంట్ స్టేజ్ పైనే వీళ్ళిద్దరూ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ లవ్ బర్డ్స్ అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Shobha Shetty: Bigg Boss Shobha engagement... why so secret?

ఈ ఫోటోలను స్టార్ మా సీరియల్స్ కు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేయగా, ముందుగా అందరూ ఇవి సీరియల్ సమయంలో తీసిన ఫోటోలు అని అనుకున్నారు. కానీ ఆ ఫోటోలలో యశ్వంత్, శోభా శెట్టి తల్లిదండ్రులు కూడా ఉండడంతో వీరిద్దరికీ నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఈ జంట ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. మరి వీరిద్దరూ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అనే అయోమయంలో పడ్డారు బుల్లితెర ప్రేక్షకులు.

Shobha Shetty: Bigg Boss Shobha engagement... why so secret?

Shobha Shetty: Bigg Boss Shobha engagement... why so secret?

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు