Vyooham: బెడిసి కొట్టిన ఆర్జీవీ “వ్యూహం”… సెన్సార్ సర్టిఫికేట్ రద్దు

Vyooham: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” బెడిసి కొట్టింది. ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా వివాదం జరుగుతుండగా, తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. “వ్యూహం” మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ మరోసారి రివ్యూ చేయాలంటూ తాజాగా హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో “వ్యూహం” టీంకు కోర్టులో చుక్కెదురు అయ్యింది.

ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “వ్యూహం” లో అజ్మల్, మానస ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని దాసరి కిరణ్ నిర్మించగా, “వ్యూహం” మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే వివాదం రాజకుంది. ఇక ట్రైలర్ విడుదలైన వెంటనే ఆ వివాదం మరింత పెద్దదయింది. ఈ నేపథ్యంలోనే “వ్యూహం” సినిమాను చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా తెరకెక్కించారని ఆరోపిస్తూ, సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మూవీకి సీబీఎఫ్సి చట్ట విరుద్ధంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. ఆ పిటిషన్ లో తనకు చంద్రబాబు, పవన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని, వైయస్ జగన్ అంటేనే ఇష్టమని ఆర్జీవి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అన్నారని, “వ్యూహం” సినిమా తనను కించపరిచేలా రూపొందించారని లోకేష్ పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ పిటిషన్ విచారణకు రాగా జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. దీంతో సినిమాను వాయిదా వేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ జనవరి 8న “వ్యూహం” సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. ఒకవేళ ఈ సినిమా ఎఫెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోతున్న ఎలక్షన్స్ పై పడుతుంది అనుకుంటే కనీసం తెలంగాణలో అయినా విడుదల చేసే వీలు కల్పించమని “వ్యూహం” మూవీ టీం తరపు న్యాయవాది జడ్జిని కోరారు.

- Advertisement -

ఇలా ఈ పిటిషన్ పై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతుండగా తాజాగా హైకోర్టు “వ్యూహం” మేకర్స్ కు షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చింది. ఈ కేసు పై పలు దఫాలుగా విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డ్ ఇప్పటికే జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు “వ్యూహం” సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను తిరిగి సెన్సార్ బోర్డుకు పంపిస్తూ, ఈ సినిమాను మూడు వారాల్లో మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి తాజాగా హైకోర్టు తీర్పుతో “వ్యూహం” సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కాబోతుంది అనే విషయం మాత్రం స్పష్టమైంది. మరి ఈ మూవీని ఆర్జీవి అనుకున్న విధంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో ఎలక్షన్స్ కంటే ముందే విడుదల చేస్తాడా? లేదంటే ఆలస్యంగానైనా సరే థియేటర్లోనే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు