RGV: అడుక్కొని టీ తాగండి.. నాగబాబుపై వర్మ కౌంటర్..!

నాగబాబు, రాంగోపాల్ వర్మ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వీరి వ్యవహారం ఉంటుంది. మొన్నటి వరకు గొడవ పడ్డ వీరు గడిచిన కొన్ని నెలల క్రితం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరిపోయాయి.. ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉన్న నాగబాబు ఇప్పుడు వర్మ ను గెలకడంతో వర్మ మళ్ళీ నాగబాబుని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

వ్యూహం సినిమా పొలిటికల్ పరంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంశాలతో తెరకెక్కించారు. దీంతో వర్మకు బహిరంగంగా బెదిరింపులు కూడా వస్తున్నాయి. పలువురు టిడిపి నేతలు డెబిట్ లో కూర్చుని మరీ వర్మ ను బెదిరిస్తున్నారు. వర్మ తలను తీసుకువస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు.. ఇలాంటి వాటికి రాంగోపాల్ వర్మ భయపడడు. కానీ సీన్ క్రియేట్ చేయాలనుకున్నాడేమో కానీ ఆ బెదిరింపుల పైన వర్మ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ ఫిర్యాదు పై నాగబాబు కౌంటర్లు వేశారు.. వర్మ తల *రికితే కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి మాటలు మాట్లాడడం తప్పే.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. అంతేకాదు వర్మ మీరు భయపడకండి.. మీ జీవితానికి ఏ డోకా లేదు మీ ప్రాణానికి ఏ అపాయం కూడా వాటిల్లదంటూ హామీ ఇస్తున్నాను అంటూ తెలిపారు.. ఎందుకంటే ఇండియాలో ఏ పనికిమాలిన ఎదవ మీకు ఎటువంటి హాని తలపెట్టడని అనుకుంటున్నాను.. హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ ని ఎవరు చం*రు కదా అంటూ తెలియజేశారు.

- Advertisement -

అందుకు సంబంధించిన ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది. దీంతో వర్మ తనదైన స్టైల్ లో కౌంటర్ వేయడం జరిగింది. సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా చిత్రంలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోవడం అంటూ వర్మ ఒక ట్వీట్ చేయడం జరిగింది.. ఇలా వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీంతో వైసిపి శ్రేణులు నాగబాబుని తిడుతూ పలు రకాలుగా ట్వీట్లు చేస్తున్నారు.

 

rvg tweet
rvg tweet

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు