Chiranjeevi: ఆ స్టార్ హీరో స్టేటస్ ని చూసి తట్టుకోలేకపోయా – చిరు..!

టాలీవుడ్ లో హీరో విక్టరీ వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉంటారు. తనదైన కామెడీ టైమింగ్ తో కుటుంబ కథా చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు వెంకటేష్. అంతేకాదు తన సినీ కెరీర్ లో 75 సినిమాలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం సైంధవ్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక వెంకటేష్ 75 చిత్రాలను పూర్తి చేసుకున్నందుకు గానూ ఆయన అభిమానులు , ప్రేక్షకులు, సెలబ్రిటీలు సైతం వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

ఈ సందర్భంగా సైంధవ్ సినిమా నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఒక ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించారు.. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా చిరంజీవి , రాఘవేంద్రరావు వచ్చారు. వీరితోపాటు అడవి శేష్ , ఆలీ, బ్రహ్మానందం, శ్రీ విష్ణు, నాని తదితర సినీ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈవెంట్ కి విచ్చేశారు. అయితే ఈవెంట్లో అందరూ వెంకటేష్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు చాలా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వేడుక అలాంటిదే.. నాకు వెంకటేష్ తో కలిసి 40 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు.. సురేష్ ప్రొడక్షన్ లో 1983లో సంఘర్షణ చిత్రాన్ని చేశాను. అప్పుడే సురేష్ బాబు నాకు బాగా పరిచయమయ్యారు. అదే సమయంలో రామానాయుడు కి రెండవ కుమారుడు ఉన్నారన్న విషయం తెలిసిందని తెలిపారు.

- Advertisement -

ఆ తర్వాత కొన్నేళ్ళకి ఎంతో అందంగా ఉన్నటువంటి వెంకటేష్ ని చూశాను.అప్పుడే తనలో ఒక గుబులు మొదలయ్యిందని.. ఇతను హీరో అయితే తనకు కచ్చితంగా గట్టి పోటీ వస్తుందని చాలా భయపడ్డానని.. కానీ రామానాయుడు తన కుమారుడు వెంకటేష్ కి సినిమాలలోకి రావడం ఆసక్తి లేదని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నానని తెలిపారు చిరు. కానీ ఆ తర్వాత రెండేళ్లకే వచ్చి వెంకటేష్ సినిమాలు తీయడం మొదలు పెట్టారని తెలిపారు..

ఆ తర్వాత పరిచయం అవ్వడంతో మిత్రులుగా మారి ఒకరి గురించి మరొకరు విషయాలు తెలుసుకొని సినీ ప్రయాణాన్ని చేస్తున్నామని తెలిపారు.. వెంకీ ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా చూపిస్తారు.. తను నటించిన చిత్రాలలో మల్లేశ్వరి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు చిరు.. అంతేకాకుండా వెంకీ అన్ని జోనర్స్ ని టచ్ చేస్తారు.. మా ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని ఇద్దరి కోరిక ఉందని ఒకవేళ మంచి కథ దొరికితే ఖచ్చితంగా చేస్తామని తెలిపారు చిరంజీవి.

 

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు