Vijaykanth: కెప్టెన్ విజయ్ కాంత్.. పేరు వెనుక రహస్యం ఇదే..?

కెప్టెన్ విజయ్ కాంత్.. కోలీవుడ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన డైరెక్ట్ గా తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. హీరో గానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. మరొకవైపు డీఎండీకే రాజకీయ పార్టీని కూడా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. 1952 ఆగస్టు 25 తమిళనాడులోని మధురైలో కేఎన్ అలగస్వామి, ఆండాళ్ దంపతులకు జన్మించిన ఈయన 1990 జనవరి 31వ తేదీన ప్రేమలత ను వివాహం చేసుకున్నారు. ఇక వీరికి విజయ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

ఇకపోతే వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాలను దక్కించుకున్న ఈయన ఇటీవల రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ మరింత బిజీగా మారారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం శ్వాస కోస సంబంధిత సమస్యలతో బాధపడ్డ ఈయన ఆసుపత్రిలో చేరి మెరుగైన చికిత్స పొంది.. ఇటీవల తిరిగి ఇంటికి చేరుకున్నారు.. కానీ నిన్న మళ్ళీ కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు వైద్య బృందం ప్రకటించింది.

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉండగా.. అందులో భాగంగానే విజయ్ కాంత్ ను కెప్టెన్ విజయ్ కాంత్ అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? అని తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఏ హీరో కైనా లేదా నటుడికైనా తాము నటించిన పాత్రలు లేదా సినిమాలు గ్రాండ్ సక్సెస్ ని అందిస్తే మాత్రం అదే పాత్రతో లేదా ఆ సినిమా పేరుతో తమ ఇంటి పేరుగా మార్చి పిలవడం జరుగుతుంది. ఇప్పటికే తెలుగులో కూడా చాలామంది నటులు ఇలా తాము నటించి, సక్సెస్ పొందిన సినిమా పేరునే తమ ఇంటి పేర్లుగా మార్చుకొని ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇక కెప్టెన్ విజయకాంత్ కూడా అంతే..

- Advertisement -

1992లో కెప్టెన్ ప్రభాకరణ్ అనే చిత్రంలో నటించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు విజయకాంత్. ఇక ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకులు ఆయనకు కెప్టెన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అలా విజయకాంత్ కాస్త కెప్టెన్ విజయకాంత్ గా మారిపోయారు. మరి ఈరోజు ఆయన స్వర్గస్తులు కావడంతో ఆయనకు సంబంధించిన ఇలా ఎన్నో విషయాలు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు