2023 Tollywood Directors : నటులుగా సక్సెస్.. డైరెక్టర్లుగా ఫెయిల్

స్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై కథను ముందుకు నడిపిస్తే, దర్శకుడు స్క్రీన్ వెనకాల ఉండి అన్ని శాఖలను నడిపిస్తాడు. మెగా ఫోన్ పట్టుకుని అన్నింటినీ ముందుండి నడిపించే డైరెక్టర్ నటుడిగా మారితే ఎలా ఉంటుంది? సెట్లో యాక్షన్ కట్ చెప్పే డైరెక్టర్ నటులుగా మారి క్లాప్ కొట్టించుకుంటే వచ్చే కొత్తదనమే వేరు. అందుకే ఇటీవల కాలంలో కొంతమంది దర్శకులు నటులుగా కూడా సత్తా చాటుతున్నారు. అయితే 2023లో నటులుగా టాలెంట్ నిరూపించుకున్న దర్శకులు డైరెక్టర్స్ గా మాత్రం ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

1. శ్రీకాంత్ రెడ్డి
డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ ఏడాది “ఆదికేశవ” సినిమాతో దారుణమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా గతంలోనూ ఆయన రూపొందించిన “దోచేయ్”, “తుంటరి” వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. “ఆదికేశవ” సినిమాతో ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. కానీ 2023లో చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన “మ్యాడ్” సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. డైరెక్టర్ గా ఫెయిల్ అయినప్పటికీ, శ్రీకాంత్ రెడ్డి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

2. శ్రీకాంత్ అడ్డాల
ఫ్యామిలీ సబ్జెక్టుపై మంచి పట్టు ఉన్న శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇలాంటి డిఫరెంట్ మాస్ జోనర్లనూ హ్యాండిల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది “పెదకాపు” సినిమాతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. కానీ “పెదకాపు” మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇదే మూవీలో శ్రీకాంత్ అడ్డాల విలన్ గా నటించి మెప్పించారు.

- Advertisement -

3. సముద్రఖని
నటుడిగా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సీనియర్ నటుడు సముద్రఖని సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. తిరుగులేని నటుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్న సముద్రఖని ఈ ఏడాది “బ్రో” సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం బ్రో భారీ అంచనాలతో జూలై 28న థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో నటుడిగా దూసుకు వెళ్తున్న సముద్రఖని దర్శకుడిగా మాత్రం “బ్రో” సినిమాతో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

వీళ్లతో పాటు చాలామంది దర్శకులు ఒకవైపు దర్శకత్వాన్ని కొనసాగిస్తూనే నటనపై తమకున్న మక్కువను సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తూ తీర్చుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, కరుణ కుమార్ వంటి తెలుగు దర్శకులు నటులుగా కొనసాగడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. వీళ్లతో పాటు తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్జె సూర్య దర్శకత్వంలో కంటే నటులుగానే ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేస్తున్నారు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు