Vijaykanth: తెలుగులో రీమేక్ అయిన విజయకాంత్ చిత్రాలివే..!

ప్రముఖ కోలీవుడ్ నటుడు , డీఎండీకే అధినేత విజయ్ కాంత్ 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రెటరీ ప్రకటించింది. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు సమాచారం. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయ్ కాంత్ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకొని ఇటీవల కోలుకున్న ఈయనకు మళ్లీ నిన్న కరోనా సోకినట్లు సమాచారం. ఇక పరిస్థితి కాస్త విషమించడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతుండగానే ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆయన మరణానికి అటు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని విజయకాంత్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇక అందులో భాగంగానే విజయ్ కాంత్ నటించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు . వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం

ఇక విజయ్ కాంత్ తమిళంలో నటించిన చిత్రాలు చిత్రాలు తెలుగు, హిందీ వంటి భాషలలో డబ్బింగ్ అయ్యి భారీ విజయాలను అందుకున్నాయి.ముఖ్యంగా
1991 కాలంలో డైరెక్ట్గా తెలుగు సినిమాలతో పోటీపడి మరి ఈయన డబ్బింగ్ సినిమాలు విడుదల అయ్యేవి.. అంతేకాదు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా విజయ్ కాంత్ మంచి పాపులారిటీ అందుకున్నారు. మరి విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో ఏ మూవీలుగా రీమేక్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.

సట్టం ఓరు ఇరుట్టరాయ్ సినిమా 1981లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది చట్టానికి కళ్ళు లేవు అనే టైటిల్ తో చిరంజీవి రీమేక్ చేశారు.

- Advertisement -

విజయ్ కాంత్ 1983 లో కన్నడలో నటించిన గెలువు నన్నదే చిత్ర కథను ఆధారంగా చేసుకుని.. 1984లో వెట్రి,అదే ఏడాది దేవాంతకుడు చిత్రాలు రీమేక్ అయ్యాయి.

1984లో తమిళంలో నటించిన వైదేకి కాతిరంతల్ మూవీని తెలుగులో 1986లో మంచి మనసులు అనే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.

ఇక 1985లో విడుదలైన నానే రాజా నానే మంతిరి చిత్రాన్ని తెలుగులో నేనే రాజు నేనే మంత్రి టైటిల్తో 1987లో రీమిక్స్ చేశారు.

అమ్మన్ కోయిల్ కిజక్కలే చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నెంబర్ 786 అనే టైటిల్ తో రీమేక్ చేశారు ఇక ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతే కాదు చిరంజీవికి ఈ సినిమా స్టార్ స్టేటస్ ను కూడా అందించింది.

1987లో వచ్చిన నినైవే ఓరు సంగీతం సినిమాను తెలుగులో దొంగ పెళ్లి అనే టైటిల్ తో 1988లో రిలీజ్ చేశారు ఇందులో కృష్ణ హీరో గా నటించారు.

1989లో వచ్చిన ఎన్ పరుషన్ తాన్ ఎనక్కు మట్టుమ్తాన్ సినిమాను తెలుగులో అదే ఏడాది నా మొగుడు నాకే సొంతం అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక ఈ చిత్రానికి హీరోగా మోహన్ బాబు నటించారు.

1992లో చిన్న గౌందర్ చిత్రాన్ని 1992లో చిన్న రాయుడు పేరిట రీమేక్ చేయడం జరిగింది ఇక ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు.

1998లో వచ్చిన హిందీ మూవీ గాయల్ చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది గమ్యం పేరిట రిలీజ్ చేయడం జరిగింది.

ఇక 2000 సంవత్సరంలో వనతైపోళ అనే చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది మా అన్నయ్య పేరిట రీమేక్ చేయడం జరిగింది ఇక ఇందులో హీరో రాజశేఖర్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

2002లో రమణ అనే సినిమాను రీమేక్ చేస్తూ ఠాగూర్ సినిమాను తెరకెక్కించారు ఇక చిరంజీవి నటించిన ఈ సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది.

2004లో వచ్చిన యంగ్ అన్న చిత్రాన్ని కుషీ కుషీగా పేరిట రిలీజ్ చేశారు ఇందులో జగపతిబాబు హీరోగా నటించారు

వీటితోపాటు మరెన్నో విజయ్ కాంత్ నటించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు