Shobha Shetty: ఎట్టకేలకు ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్..!!

Shobha Shetty: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ మోనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బిగ్ బాస్ -7 లోకి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ అందుకుంది. హౌస్ లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంది. అలాగే తన ఆట తీరుతో మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ను మరొకసారి అలరించింది. హౌస్‌లో కూడా ఎంతోమందితో పోటీపడి మాటకు మాట చెబుతూ అందరికీ చుక్కలు చూపించి.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది మోనిత అలియాస్ శోభా శెట్టి. కానీ, ఈ విషయమే శోభకు కాస్త నెగిటివిటీ తీసుకువచ్చిందని చెప్పవచ్చు.

దీంతో శోభా శెట్టి పైన శృతిమించిన కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. దీని ప్రభావం వల్ల ఓటింగ్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఫలితంగా గ్రాండ్ ఫినాలే కు చేరకుండానే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది శోభ శెట్టి. ఇదంతా ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రేమ గురించి ప్రియుడు గురించి బయట పెట్టిన శోభ.. కార్తీకదీపం సీరియల్ లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

తాజాగా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా తన యూట్యూబ్ నుంచి ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది శోభ. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కొత్త సంవత్సరం ఒక టీవీ షోలో స్టేజ్ పైన శోభ యశ్వంత్ చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది.. అలా పూలదండలు ఉంగరాలు మార్చుకుని చూపించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంతమంది ఇదంతా కేవలం టీవీ ప్రోగ్రాం కోసమే అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కానీ యశ్వంత్ తన కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షో కి వస్తాడు అని ఊహించలేదని.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఆ స్టేజ్ పైన తెలియజేసింది శోభ.. కానీ ఎట్టకేలకు మా ఎంగేజ్మెంట్ ఇలా జరిగిపోయింది అంటూ శోభా శెట్టి ఒక వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు