Sreeleela: ఐరెన్ లెగ్‌ ట్యాగ్‌కు అర అడుగు దూరం… మరో 10 రోజుల్లోనే..!

Sreeleela: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అంటే… అందరూ బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరే చెబుతారు. అలాంటిది మరి పూజా ట్రాక్ రికార్డ్. అయితే ఈ ఐరెన్ లెగ్ ట్యాగ్ కోసం ఓ యంగ్ బ్యూటీ తెగ పోటీ పడుతుంది. అది ఎవరో కాదు… క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకుని, తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.

శ్రీలీల ఐరెన్ లెగా… ఇది ఒప్పుకోమని ఆమెను అభిమానించే వాళ్లు గగ్గోలు పెట్టొచ్చు. ఎందుకంటే ఆమె యాక్టింగ్ కు కానీ, ఆమె మాస్ డ్యాన్స్‌కు కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం శ్రీలీల చేసే డ్యాన్స్‌కు అయితే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారణంతోనే చాలా సినిమాల్లో ఛాన్స్ వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం.

అయితే ఇప్పుడు శ్రీలీల పెద్ద ప్రమాదంలో ఉంది. దీనికి కారణం ఆమె అని అనుకోవచ్చు. ఒక రెండు హిట్స్ పడ్డ వెంటనే వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేసింది. హీరో ఎవరు? స్టోరీ ఏంటి? డైరెక్టర్ దగ్గర అంత స్టఫ్ ఉందా? లాంటివి అసలు చెక్ చేసుకోలేదు. సినిమాలు చేస్తే సరిపోతుంది అనే ఫీల్ ఉంది. అలా చేయడం వల్లే ఆమె కెరీర్‌లో 2023 ఇయర్ బ్యాడ్ ఇయర్ గా మారి పోయింది.

- Advertisement -

2023లో శ్రీలీల ఏకంగా 4 సినిమాలు చేసింది. స్కంద, ఆది కేశవ, ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ లాంటి సినిమాలు డిజాస్టార్ గా మిగిలిపోయాయి. ఇక భగవంత్ కేసరి హిట్ అయినా, అది ఆమె కెరీర్‌కు హెల్ప్ అయిందేమీ లేదు. ఫలితంగా ఇప్పటికే శ్రీలీలకు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ కొంత వరకు వచ్చింది. కానీ, ముందు గుంటూరు కారం లాంటి భారీ మూవీ ఉంది. ఈ సినిమా హిట్ అయితే, ఈమె ఫర్మామెన్స్‌కు, డ్యాన్స్‌కు మంచి మార్కులు పడితే, ఐరెన్ లెగ్ ట్యాగ్ నుంచి బయట పడొచ్చు.

ఒక వేళ ఈ సినిమా అంచనాలను అన్నింటినీ తారుమారు చేసి నెగిటివ్ తెచ్చుకున్నా.. హిట్‌ అవ్వకపోయినా, శ్రీలీల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోవడం మాత్రమే కాదు… కెరీర్ ను ఎంత ఫాస్ట్ బిల్డ్ చేసుకుందో… అంతే ఫాస్ట్‌గా డ్రాప్ అవ్వడం ఖాయం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు