Siddharth: ఆ హీరోయిన్ని సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా.. ఫోటోతో క్లారిటీ..!!

Siddharth: హీరో సిద్ధార్థ్ తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. గతంలో హీరోయిన్ సమంత తో లవ్ రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు మళ్లీ మరొక హీరోయిన్ అతిది రావు హైదరి తో గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్తలు రావడానికి ముఖ్య కారణం వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ.. ఎయిర్పోర్ట్ లలో కూడా కనిపించడంతోపాటు అప్పుడప్పుడు ఒకరి ఇంట్లో ఒకరు కనిపిస్తూ ఉండడంతో ఈ రూమర్స్ మరింత నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా పలు రకాల సినిమా ఈవెంట్లకి కూడా కలిసి వెళ్ళడమే కాదు కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. అయితే సిద్ధార్థ్, అదితి ఈ విషయం పైన ఇప్పటివరకు ఓపెన్ కాలేదు.. పాన్ ఇండియా లెవెల్ లో సిద్దార్థ్ నటించిన చిన్న సినిమాని బాలీవుడ్ లో దగ్గరుండి ఈ ముద్దుగుమ్మ చూసుకుందని సమాచారం. ఇక పుట్టినరోజులకు కూడా ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషేస్ తెలియజేస్తూ ఉంటారు ఈ జంట. దీంతో ఇప్పుడు మరొకసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు కలిసి విదేశాలలో తిరుగుతూ చాలా క్లోజ్ గా దిగిన ఒక ఫోటోని షేర్ చేసి విషెస్ తెలియజేయడం జరిగింది.

ఇలా ఇద్దరు కలిసి మళ్ళీ ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ అధికారికంగా రిలేషన్ లో ఉన్నారంటూ త్వరలోనే ప్రకటించబోతున్నారంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సిద్దార్థ్ కూడా ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని.. సిద్దార్థ్ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరి వీరు పెళ్లి చేసుకుంటారా లేదా డేటింగ్ లోనే ఉంటారా అనే అనుమానం కూడా అందరిలోనూ కలుగుతుంది.

- Advertisement -

Is Siddharth going to marry that heroine for the second time..

సిద్ధార్థ్, అదితి వివాహం చేసుకుంటే వీరిద్దరికి ఇది రెండో వివాహమవుతుంది. గతంలో సిద్దార్థ్.. మేఘన నారాయణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు విడిపోయారు.. అదితి కూడా సత్యదేవ్ మిశ్రా అనే నటుడిని వివాహం చేసుకోగా కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. గతంలో వీరిద్దరూ మహాసముద్రం అనే సినిమాలో నటించడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య క్లోజ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు