Rathika Rose: కోడి ఈకలతో అందాలు దాచేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..ఫొటోస్ వైరల్..!

రతికా రోజ్ .. బిగ్ బాస్ లోకి రాక ముందు వరకు ఈమె గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మొదట షోలో పాల్గొన్నప్పుడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం నడుపుతూ తెగ హాట్ టాపిక్ గా మారిన ఈమె.. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది.. ఇక మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈమెను చూసి.. ఇకనైనా ఆటతో సత్తా చాటుతుంది అనుకున్నారు ఆడియన్స్.. కానీ ఆమె అక్కడ పులిహోర కలుపుతూ టైం పాస్ చేసిందే కానీ ఆటపై శ్రద్ధ పెట్టలేదు. ఇకపోతే తన అందచందాలతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. ఇక తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కోడి ఈకలతో తన అందాలను దాచుకుంటూ కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

రతికా కెరియర్..
రతికా కెరియర్ విషయానికి వస్తే.. తెలంగాణకు చెందిన ఈమె.. మే 12న జన్మించింది. పుట్టి పెరిగింది అంతా హైదరాబాదులోనే.. ఇక తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి చెందిన కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి.. 2016లో ప్రారంభమైన పటాస్ షో తో కెరియర్ ప్రారంభించింది. అయితే ఈ షో ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వకు ముందు ఒక మోడల్ గా కూడా రాణించింది. అప్పటికే పలు యాడ్స్ లో కూడా చేసింది.. అయితే స్మాల్ స్క్రీన్ పై రాణిస్తున్న సమయంలోనే బిగ్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అక్కడ బొమ్మ అదిరింది దిమ్మతిరిగింది అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమాలో అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో కూడా నటించింది. ఇక తాజాగా బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి అలరించింది.

ఇక ఈమె ప్రేమాయణం విషయానికి వస్తే..
బిగ్ బాస్ 3 విజేత , ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది. రీసెంట్గా వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలపై రాహుల్ సిప్లిగంజ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.. ఇకపోతే గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో రతిక ఉండకూడదని రాహుల్ కండిషన్లు పెట్టడంతో వీరి ప్రేమ కాస్త బ్రేకప్ అయినట్లు రతికా సోదరి వెల్లడించింది.

- Advertisement -

గ్లామర్ ఫోటోస్..
ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈమె.. రకరకాల గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకుంటుంది. తాజాగా కోడి ఈకలను తన ఎద అందాలకు అడ్డుపెట్టుకొని ఫోటోలను షేర్ చేసింది.. అసలే తెల్ల పిల్ల దీనికి తోడు తెల్ల ఈకలను అడ్డుగా పెట్టుకోవడం చూసి నెటిజెన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈమె అందానికి ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం రతిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Rathika Rose photos in white dress went viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు