Pushpa 2 : మెలోడీ నెంబర్ కంపోజ్ చేయనున్న దేవి

Pushpa 2: ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఈ మధ్య కాలంలో దేవి హావ కొంచెం తగ్గింది కానీ, ఒకప్పుడు దేవి మ్యూజిక్ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు కూడా దేవి సరిగ్గా కూర్చొని కాన్సన్ట్రేషన్ చేస్తే అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వగలడు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ అందించడంలో దేవి తోపు. అలానే చాలామంది డైరెక్టర్స్ తో మంచి రిలేషన్ కూడా దేవికి ఉంది అని చెప్పొచ్చు.

Pushpa 2 : Devi will compose the melody number
Pushpa 2 : Devi will compose the melody number

ఇకపోతే రీసెంట్ టైంలో ఎస్ ఎస్ థమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఇద్దరికీ మంచి మ్యూజిక్ అందించాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు అన్నిటికీ కూడా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. పుష్ప సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్బమ్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటలకి మంచి పేరు వచ్చింది. రీసెంట్గా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి.

బ్లాక్ బస్టర్ లైనప్

- Advertisement -

ఇకపోతే దేవి ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఒకదాన్ని మించిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది అని చెప్పొచ్చు. శివ దర్శకత్వంలో సూర్య చేస్తున్న కంగువ సినిమాకి దేవి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాకి సంగీతం అందిస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో దేవిశ్రీప్రసాద్ చేస్తున్న మొదటి సినిమా ఇది. వీటన్నిటిని మించి దేవి చేస్తున్న అద్భుతమైన ప్రాజెక్టు పుష్ప.

మెలోడీ నెంబర్ కంపోజ్ చేయనున్న దేవి

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానిని మించి పుష్ప 2 సినిమాని హిట్ చేయాలని టీమ్ అంతా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి అలానే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశాడు. అయితే పుష్ప 2 సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అంట దేవి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మెలోడీ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ సాంగ్స్ విన్న ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అలానే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట కూడా మంచి మెలోడీ అనిపించుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో ఈ సాంగ్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు