Allu Arjun : మా తాత లేకపోతే పంక్చర్లు వేసుకునే వాడివి.. నాగబాబుపై బన్నీ సెటైర్ ట్వీట్..!

Allu Arjun.. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో తన స్టార్ డం మారిపోయింది. ఈ చిత్రంతో ఇతర దేశాలలో కూడా తన హవా చూపించేలా చేశారు అల్లు అర్జున్.. గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం , అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇటీవల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి చెందిన నేత తన స్నేహితుడు రవిచంద్ర కు సపోర్టు చేస్తూ ప్రచారం చేశారు. దీంతో అటు నాగబాబు, జనసేన కార్యకర్తలు సైతం అల్లు అర్జున్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు.

అల్లు అర్జున్‌పై నాగబాబు ట్వీట్…

Allu Arjun: Allu Arjun comments about nagababu..!
Allu Arjun: Allu Arjun comments about nagababu..!

ఇక ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా నాగబాబు అసలు బుద్ధితో తన ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ చేస్తూ.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అన్నట్టుగా తెలియజేశారు.. దీంతో కచ్చితంగా ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేశారని అభిమానులు సైతం నాగబాబు పైన ఫైర్ అయ్యారు.. అయితే ఇదంతా సర్దుమణుగుతున్న సమయంలో అల్లు అర్జున్ ట్విట్టర్ నుంచి ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారుతోంది. అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇలాంటి పోస్ట్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అల్లు రామలింగయ్య వల్లే బ్రతుకు..

అల్లు అర్జున్ ఖాత ఓపెన్ చేస్తే.. ఇలా కనిపిస్తోంది.. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనే వాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాప్ పంక్చర్లు వేసుకునేవాడు అంటూ ఒక ట్వీట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు కూడా తెగ వైరల్ గా చేస్తున్నారు.. ఎలక్షన్ ముందు నాగబాబు ట్విట్ చేసి ఉంటే సరిపోయేది..కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత అవసరం తీరాక ఇలా చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -
Allu Arjun
అల్లు అర్జున్ పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్

తలలు పట్టుకుంటున్న అభిమానులు..

ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్టు ఇలా కనిపించడంతో చాలామంది మెగా అభిమానులు అల్లు అభిమానులు సైతం అయోమయానికి గురవుతున్నారు. మరి మొత్తానికి అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాక్ అయిందా లేకపోతే అల్లు అర్జున్ కౌంటర్ వేయాలని ఇలా చేశారా అనే విషయం మాత్రం తెలియక ఇప్పుడు అభిమానులను తల పట్టుకునేలా చేస్తోంది. మరి ఈ విషయం పైన అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి మరి.తాజాగా అందిన సమాచారం మేరకు..ఆ ట్వీట్ అల్లు అర్జున్ చేయలేదు. కానీ, ఎవరో ఎడిట్ చేశారని అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది

అల్లు అర్జున్ సినిమాలు..

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. మరి ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు