G V Prakash: దయచేసి అందరి ఎమోషన్స్‌ అర్థం చేసుకోండి

G V Prakash: ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు జీవి ప్రకాష్ ఒకరు. అయితే జీవి ప్రకాష్ కుమార్ ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడు అని చాలా తక్కువ మందికి తెలుసు. కొన్ని సంవత్సరాలు పాటు ఏఆర్ రెహమాన్ దగ్గర వర్క్ చేసి కొన్ని పాటలను కూడా పాడాడు. ఆ తర్వాత హరీష్ జయరాజ్ దగ్గర కూడా పనిచేశాడు జీవీ ప్రకాష్. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. జీవి ప్రకాష్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ లో అద్భుతమైన ఫీల్ ఉంటుందని చెప్పొచ్చు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఫేమస్.

మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు

కరుణాకర్ దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా జీవీ సంగీతం మాత్రం అద్భుతమని చెప్పొచ్చు. తెలుగులో ఎన్నో గుర్తుండే పోయే పాటలను జీవి ప్రకాష్ అందించారు. రీసెంట్ గా ధనుష్ నటించిన సార్ సినిమాకి సంగీతం అందించాడు జీవి ప్రకాష్. ఈ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి. తెలుగులో ధనుష్ చేసిన మొదటి సినిమా ఇది. ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో మరో సినిమా కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
G V Prakash: Please understand everyone's emotions
G V Prakash: Please understand everyone’s emotions

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక వ్యక్తిగత పరిస్థితులు వ్యక్తిగత సమస్యలు ఉండటం అనేది సహజం. తన కెరీర్లు సైంధవిని పెళ్లి చేసుకున్నాడు జీవి ప్రకాష్ వీరిద్దరు కూడా కొంతకాలం బాగానే కలిసున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న చిన్న విభేదాలు కారణంగా ఫ్యామిలీతో అనేక చర్చలు జరిపిన తర్వాత ఇద్దరు పరస్పర ఇష్టంతో ఒకరి నుంచి ఒకరు విడిపోయారు. ఈ విడిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి వీటన్నిటి పైన స్పందించాడు జీవీ ప్రకాష్.

జీవి ప్రకాష్ రిక్వెస్ట్

‘ఇద్దరు వ్యక్తులు ఒక్కటైనా.. విడిపోయినా వారి గురించి పూర్తిగా తెలియకుండా డిబేట్‌ పెట్టడం అసలు మంచి పద్ధతి కాదు. మేమిద్దరం విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులకు చెప్పాం. అలాగే మా స్నేహితులకు కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చాం. అయినా, ఇది మేం వెంటనే తీసుకున్న నిర్ణయం కాదు అనేది నిజం. కానీ, మీరు ఇలా పిచ్చి పిచ్చిగా కామెంట్స్‌ చేస్తే బాధగా ఉంది. దయచేసి అందరి ఎమోషన్స్‌ అర్థం చేసుకోండి’’ అంటూ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ రిక్వెస్ట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు